Mumbai: దుర్మార్గుడు.. పని చేయించుకొని జీతం అడిగేసరికి అలా?

Mumbai: ఇటీవల కాలంలో చాలా మంది పొట్ట కూటికోసం సొంత ఊరుని విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. అయితే కొందరు అదృష్టవశాత్తు మంచిగా బ్రతుకుతెరువు సాగిస్తుండగా ఇంకొందరు మాత్రం ఊహించని విధంగా అనేక రకాల కష్టాల పాలవుతున్నారు. ఇంకొంతమంది మాత్రం ఎక్కడికి వెళ్లినా కూడా బతుకులు మారడం లేదు అంటూ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. కొన్ని కొన్ని ప్రదేశాలలో పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వక అలా వలస వచ్చిన వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అతని పేరు పంకజ్. వయసు 18 ఏళ్లు. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో అతని కుటుంబం చాలా ఏళ్ల కిందటే ముంబైకి వలస వచ్చి ముంబైలోని దాదార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పంకజ్ తల్లి చిన్నప్పుడు చనిపోవడంతో అప్పటినుంచి తండ్రి రామ్ రాజ్ జైస్వార్ స్థానికంగా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇక 10వ తరగతి వరకే చదువుకున్న పంకజ్ ఆ పై చదువులు చదవడానికి కుదరకపోవడంతో అప్పటి నుంచి అక్కడక్కడ పనులకు వెళ్లేవాడు.

 

ఈ నేపథ్యంలోనే గత 6 నెలల కిందట ఒక కిరాణ షాపులోకీ పనికి వెళ్తున్నాడు. అక్కడే చాలా కాలం పాటు ఎంతో నమ్మకంతో కష్టపడి పని చేశాడు. నీ బాధాకరమైన విషయం ఏమిటంటే 6 నెలల దాటినా కూడా ఆ షాపు ఓనర్ మాత్రం పంకజ్ కు జీతం ఇవ్వలేదు. దాంతో పంకజ్ కీ అతడికి పూట గడవడమే కష్టంగా మారింది. దాంతో జీతం ఇవ్వాలి అనే పంకజ్ ఓనర్ ని చాలాసార్లు అడిగాడు. కానీ ఆ ఓనర్ మాత్రం జీతం ఇవ్వడానికి నిరాకరించాడు. ఇక ఓనర్ జీతం ఇవ్వకపోవడంతో వెంటనే పంకజ్ అతని దగ్గర పని మానేసి పాత ఓనర్ దగ్గరే పని చేయడానికి వెళ్ళాడు. అక్కడ నెల రోజుల పాటు పని చేశాడు. అతడు కూడా జీతం ఇవ్వలేదు. దీంతో పంకజ్ తట్టుకోలేక ఓనర్ ను డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడిగాడు. ఇక ఆవేశంతో ఊగిపోయిన ఆ ఇద్దరు ఓనర్లు పంకజ్ పై దారుణానికి పాల్పడ్డారు. అతనికి గుండె చేయించి, నగ్నంగా రోడ్డుపై ఊరేగించారు. ఈ అవమానాన్ని భరించలేని ఆ యువకుడు నేరుగా ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పంకజ్ తండ్రి రామ్ రాజ్ జైస్వార్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -