Ramya: సీనియర్ నరేష్ పై మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు వైరల్!

Ramya: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల అంశం ఎప్పుడూ హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఎవరు ఎవర్ని వివాహం చేసుకుంటున్నారు, ఎవరితో విడిపోతున్నారు, ఎవరితో అఫైర్స్ నడుపుతున్నారనే అంశాలపై మీడియా, సోషల్ మీడియా కూడా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకుల్లోనూ ఉంటుంది. ఇక సినీ ప్రముఖుల్లో చాలా మంది ఒకటికి మించి పెళ్లి చేసుకున్న సందర్భాలనూ చూస్తూనే ఉన్నాం. ఆ కోవలోకే వస్తారు సీనియర్ నటుడు నరేష్.

నటిస్తున్న సినిమాలతోపాటు పెళ్లిళ్ల అంశంతోనూ వార్తల్లో నిలుస్తుంటారు నరేష్. ఇప్పటికే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇది చాలదన్నట్లుగా, ప్రముఖ నటి పవిత్రా లోకేష్ తో ఆయన ప్రేమాయణం నడపడం హాట్ టాపిక్ గా మారింది. లేటు వయసులోనూ తగ్గేదేలే అన్నట్లు.. పవిత్రను పెళ్లి చేసుకోవాలని ఆయన ఫిక్స్ అయినట్లు వినికిడి. పవిత్రతో కలసి బెంగళూరులోని ఓ హోటల్ లో నరేష్ ఉన్న సమయంలో మూడో భార్యకు అడ్డంగా దొరికేయడం, అక్కడికి పోలీసులు వచ్చిన ఘటన గురించి తెలిసిందే.

తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పవిత్రను లిప్ కిస్ చేస్తూ హగ్ చేసుకున్న ఓ వీడియోను స్వయంగా నరేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తద్వారా తమ బంధం గురించి అధికారికంగా ఆయన ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఓ తెలుగు వెబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం, అందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించడం ఆసక్తిని రేపుతోంది. పవిత్రతో నరేష్ హోటల్ లో పట్టుబడిన సమయంలో.. ఆయన ఆరోగ్యం గురించి తాను ఆందోళన చెందానన్నారు. నరేష్​ ఒకానొక సమయంలో అమ్మాయిలతో పట్టుబడ్డాడని.. తనకు క్షమించమని కోరుతూ కాళ్లు పట్టుకున్నాడని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.

నరేష్ కు కళ్లెం వేసేవాళ్లే లేరు
‘ఆ రోజు నరేష్ ను ఆమె (పవిత్రా లోకేష్) చంపేస్తుందేమోనని భయపడ్డా. ఆ సమయంలో అక్కడికి రావాలని పోలీసులను నేను పిలిచా. వాళ్లూ (నరేష్, పవిత్ర) పిలిచారు. కొద్ది సేపటికి అక్కడికి వచ్చిన పోలీసులు నన్ను ఆపారు. వాళ్లను అక్కడ్నించి పంపించారు. ఆ తర్వాత నా దగ్గరుకు వచ్చి పోలీసులు సారీ చెప్పారు. పైఅధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాము అలా ప్రవర్తించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు’ అని రమ్య రఘుపతి పేర్కొన్నారు. విజయ నిర్మల బతికున్నప్పటి నుంచే పవిత్రా లోకేష్ తో నరేష్ ఎఫైర్ నడుస్తోందని.. కానీ ఇన్నాళ్లకు బయటకు వచ్చిందన్నారు. నిర్మల మృతి చెందాక నరేష్ స్వేచ్ఛకు కళ్లెం వేసేవాళ్లు లేకపోవడంతో.. ఆయన తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -