Mahesh Babu: ఫ్యాన్స్ కోరుకున్న విధంగా మళ్లీ పెళ్లికి మహేష్ రివ్యూ ఇస్తారా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మేము ఫేమస్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మేము ఫేమస్ సినిమా చూసినటువంటి మహేష్ బాబు సినిమా చాలా అద్భుతంగా ఉందని చిత్ర బృందం పై ప్రశంసల కురిపించడమే కాకుండా తన సొంత బ్యానర్లో తదుపరి సినిమా అవకాశాలను కూడా కల్పిస్తున్నట్లు ఈయన సోషల్ మీడియా వేదికగా మేము సైతం చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

ఇలా ఈ సినిమాకు ట్వీట్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు మహేష్ బాబును టార్గెట్ చేస్తూ ఆయనని ర్యాగింగ్ చేస్తున్నారు. అసలు ఒక సినిమాకి ప్రశంసలు కురిపిస్తే తప్పేంటి అని ఆలోచిస్తున్నారా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.ఈరోజు మేము సైతం సినిమాతో పాటు నరేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్ర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబుకి వరసకు అన్నయ్య అయినా నరేష్ సినిమాలో నటించారు.

 

ఈ మళ్లీ పెళ్లి అనే సినిమా నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మహేష్ బాబు ఈ సినిమాని చూడలేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ సినిమాపై స్పందిస్తూ మహేష్ బాబు మళ్లీ పెళ్లి సినిమాపై కూడా స్పందించి తన అభిప్రాయాన్ని తెలియజేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

 

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్యామిలీ గురించి కృష్ణ గారి గురించి మహేష్ బాబు గురించి కూడా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా తప్పకుండా మహేష్ బాబు చూసి ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.మరి అభిమానులు కోరుకున్న విధంగా మహేష్ బాబు మళ్లీ పెళ్లి సినిమా చూసి తన అభిప్రాయాలను తెలియజేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది అయితే మహేష్ బాబు ఇప్పటివరకు ఎక్కడా కూడా ఈ సినిమా గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. మరి ఈ సినిమా చూసి రివ్యూ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -