Fake Votes In Sajjala Family: అక్కడా ఓటు ఇక్కడా ఓటు.. నీతులు చెప్పే సజ్జల దొంగ ఓట్లపై ఏమంటారో?

Fake Votes In Sajjala Family: ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం హాట్ హాట్‌గా మారింది. ప్రతీ రోజూ ఏదో ఒక చోట ఈ వ్యవహారం బయటపడుతూనే ఉంటుంది. టీడీపీపై వైసీపీ.. వైసీపీపై టీడీపీ ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘం వరకూ వెళ్లి ఫిర్యాదు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఫిర్యాదులు తర్వాత తిరుపతి ఉపఎన్నికల కోసం తయారైన దొంగ ఓట్ల లెక్కలు అన్ని బయటకు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అధికారులపై ఈ వ్యవహారంలో వేటు పడింది. అయితే, ఆ దొంగ ఓట్లతో తమకు సంబంధం లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నా.. నిజం ఏంటో అందరికీ తెలుసు. తమకు సంబంధం లేదని మాత్రమే కాదు.. ఈసీతో మీటింగ్ తర్వాత విజయసాయిరెడ్డి ఏపీలో దొంగఓట్లు అన్ని చంద్రబాబే సృష్టించారని ఆరోపించారు.

విజయసాయిరెడ్డి చెప్పినట్టు చంద్రబాబే అన్ని దొంగఓట్లు సృష్టించారని అనుకుందాం. కానీ, రీసెంట్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీకి కూడా రెండు నియోజవర్గాల్లో ఓట్లు ఉన్నాయని తేలింది. మరి ఆ ఓట్లు కూడా చంద్రబాబు నాయుడే తయారు చేయించాడా? దీనికి విజయసాయిరెడ్డి కానీ.. సజ్జల రామకృష్ణరెడ్డి కాని సమాధానం చెప్పాలి. పొన్నూరు నియోజకవర్గంలో సజ్జల రామకృష్ణరెడ్డి, ఆయన భార్య, తన కొడుకు సజ్జల భార్గవ్, భార్గవ్ భార్య.. మొత్తం నలురుకి ఓట్లు ఉన్నాయి. పొన్నూరుతో పాటు మంగళగరిలో కూడా ఆ నలుగురికి ఓట్లు ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఉన్నట్టు తేలింది. కానీ, ఇంకా ఎక్కడైనా ఉన్నాయో లేవే తెలియాల్సి ఉంది. అయితే, రెండో ఓటు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావడంలేదు. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఓటు కోసం హైకోర్టు వరకూ వెళ్లి పోరాడాల్సి వచ్చింది. కానీ, సజ్జల కుటుంబానికి అంత ఈజీగా ఎలా రెండు ఓట్లు వచ్చాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనిపై ఆరా తీస్తే.. క్యాంప్ ఆఫీస్‌ దగ్గర నుంచే ఓట్లర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియ జరుగుతుందని తేలింది.

పొన్నూరు ఓటర్ లిస్టులో కూడా సజ్జల ఫ్యామిలీ తమ ఓట్లు చేర్చుకోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది. పొన్నూరు నుంచి సజ్జల భార్గవ్ పోటీ చేయడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. దీని కోసం పోన్నూరులో వైసీపీకి అభ్యర్థి లేరనే సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఉమ్మారెడ్డి అల్లుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్మారెడ్డి కొడుకుకి గుంటూరు ఎంపీ సీటు ఖరారు చేశారు. కాబట్టి అల్లుడుకి పొన్నూరు టికెట్ నిరాకరిస్తున్నారు. కాబట్టి అక్కడ నుంచి తనయుడిని దించాలని సజ్జల రామకృష్ఱ రెడ్డి ప్రయత్నం. అందుకే పొన్నూరులో కూడా ఓట్లు నమోదు చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -