YS Jagan – YS Sharmila: చెల్లి ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా జగన్.. ఈ ప్రశ్నల గురించి నోరు మెదపగలవా?

YS Jagan – YS Sharmila: అన్న వదిలిన బాణం.. అన్నకే గుచ్చుకుంటోంది. ఎన్నికలు దగ్గరపడే కొద్ది ఆ బాణాలు నేరుగా, చాలా షార్ప్‌గా వచ్చి జగన్‌కు తగులుతున్నాయి. షర్మిల సందిస్తున్న ప్రశ్నలకు జగన్ దగ్గర సమాధానం ఉండటం లేదు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ సూటిగా ఆమె ప్రశ్నలు సందించారు. గత ఎన్నికల ముందు జగన్ అన్న ప్రజలకు ఎదో చేస్తారన తాను కూడా జై జగన్ అన్నానని ఆమె గుర్తు చేశారు. తీరా చూస్తే అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

2019లో ఎన్నికల ముందు దశలవారీగా మద్యపాన నిషేదమని చెప్పిన జగన్ మాట తప్పారని మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేసిన తర్వాతే.. ప్రజలను ఓటు అడగడానికి వస్తామని గత ఎన్నికల ముందు జగన్ చెప్పారు. ఈ విషయాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు. ఐదేళ్లు పూర్తి అయ్యి.. మళ్లీ ఎన్నికలు సిద్దమయ్యారు. ప్రజలను మీరు సిద్దమా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. కానీ మద్యపాన నిషేదం చేయకుండా ప్రజలు ఓట్లు అడగడానికి ఎందుకు సిద్దమయ్యారని షర్మిల జగన్ ను ప్రశ్నించారు. మద్యపాన నిషేదం పక్కన పెడితే.. నాసిరకం మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో వ్యాపారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం ధరలు పెంచి సొంత బ్రాండ్లతో పేద ప్రజల రక్తం, కష్టం పీల్చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొని వచ్చి.. యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పిన జగన్ ఎంతమంది ఉద్యోగాలిచ్చారని ఆమె ప్రశ్నించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తామని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికే అమ్మఒడి అని మాట మార్చారని ఆరోపించారు. రైతులను రాజు చేస్తానని గత ఎన్నికల్లో చెప్పిన జగన్ ఎంతమంది రైతుల కష్టాలు తీర్చాడని నిలదీశారు.

గత ఎన్నికల ముందు జగన్ వలన రాష్ట్రానికి ఏదో జరుగుతుందని ఆశించి ఆయనకి జై కొట్టానని ఆమె తెలిపారు. కానీ.. జగన్ తనతో పాటు.. ప్రజలను కూడా మోసం చేశారని అన్నారు. అందుకే జై జగన్ అంటున్న వారంతా ఓసారి ఆలోచించాలని ఆమె సూచించారు. షర్మిల రోజు రోజుకు దూకుడు పెంచుతూ వైసీపీని, జగన్ ను ఇరుకున పెట్టేలా మాట్లాడినా.. వైసీపీ నేతల నుంచి స్పందన లేదు. ఎవరి నుంచి ప్రశ్నలు వచ్చినా.. సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి అర్థం లేని సమాధానాలు చెబుతారు. కానీ, ఆయన కూడా ఈసారి సైలంట్ అయ్యారు. దానికి కూడా కారణం లేకపోలేదు. సజ్జల ప్రస్తావన వచ్చినపుడే షర్మిల ఈ ప్రశ్నల వర్షం కురించారు. షర్మిల ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించిన దానికి సజ్జలకు కౌంటర్ వేశారు. సజ్జల, ఆయన కుమారుడే పెయిడ్ ఆర్టిస్టులని మండిపడ్డారు. సజ్జల నోరు అదుపులో పెట్టుకోకపోతే.. తగిన బుద్ది చెబుతానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడినా నోరు మూసుకొని ఉండనని చెప్పారు. తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని.. మాటకు మాట ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు. అందుకే సజ్జల కూడా షర్మిల కామెంట్స్ కు రెస్పాండ్ అవ్వడానికి భయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -