KCR – YS Jagan: కేసీఆర్ చేసిన తప్పు జగన్ చేయలేదా.. ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ఆగు సజ్జల?

KCR – YS Jagan: భారతంలో శకుని అనే ఓ పాత్ర ఉంటుంది. కౌరువులకు స్వయాన మేనమామ అయిన శకుని.. కౌరువుల పక్కన ఉంటూనే వారి వినాశనం కోసం పని చేస్తూ ఉంటాడు. దుర్యోదనుడికి తప్పుడు సలహాలు ఇచ్చి పాండవులను రెచ్చగొట్టేలా చేసి చివరికి కురుక్షేత్ర యుద్ధంలో కౌరువులు అంతం అయ్యేలా చేస్తాడు. కౌరువుల నాశనాన్ని శకుని ఎందుకు కోరుకున్నాడో అనేదానికి ఓ పెద్ద కథ ఉంటుంది. మరి సజ్జల రామకృష్ణరెడ్డికి అలాంటి ఫ్లాస్ బ్యాక్ ఏమైనా ఉందో ఏమో తెలియదు కానీ.. వైసీపీ నాశనాన్నే ఆయన కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఆయన నిర్ణయాలు, ఆయన ప్రకటనలు చూస్తే అదే అర్థం అవుతోంది.

సలహాదారుడు మంచోడు అయితే.. పార్టీ అధ్యక్షుల నిర్ణయాలు కానీ, ప్రభుత్వ పెద్దల ఆలోచనలు కానీ.. మంచివి అవుతాయి. ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కో సారి అప్రకటిత సీఎంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ విధంగానే మాట్లాడుతారు. సజ్జలను సలహాదారుడిగా పెట్టుకోవడం వలన జగన్ కు, వైసీపీకి ఎంతో కొంత నష్టమే కానీ ప్రయోజనం ఏ మాత్రం లేదు. ఎందుకీ విషయం చెప్పాల్సి వస్తుందంటే.. సజ్జల ప్రకటనలు, ఆయన మాట తీరు వలనే వైసీపీకి నష్టం జరుగుతోంది. అతనిది కాదు అనే పనిలో కూడా ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ప్రతీ మంత్రిత్వశాఖకు సంబంధించిన విషయంలో కూడా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారు. ఆ సదరు మంత్రి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. ఆయా శాఖలో ఏం జరుగుతుందో సజ్జల మాత్రమే చెబుతారు. ప్రతిపక్షాలను తిట్టడానికే మంత్రులను వాడుతారు. ఇలా తనదికాని బాధ్యతలను నెత్తిన పెట్టుకొని నచ్చినట్టు మాట్లాడి వైసీపీకి మరింత నష్టం కలిగిస్తున్నారు.

ఇటీవల ఆయన రెండు పెద్ద కామెంట్స్ చేశారు. మొదటి విషయానికి వస్తే.. మోడీ, జగన్ కి మంచి అండర్ స్టాండింగ్ ఉందని అన్నారు. ఎన్డీఏలో చేరాలని వైసీపీకి కూడా పిలుపు వచ్చిందట. కానీ.. బీజేపీతో పొత్తు వలన ఏపీలో కొన్ని వర్గాలను కోల్పోతామనే ఉద్దేశ్యంతో ఎన్డీఏలో చేరలేదని చెప్పారు. అయితే, బీజేపీ నుంచి పొత్తు కోసం వైసీపీకి పిలుపు రావడం ఎంత నిజమో పక్కన పెడితే.. పొత్తును అంగీకరించడం, అంగీకరించకపోవడం మాత్రం వైసీపీ వ్యక్తిగతం. దాని గురించి ఎవరూ కామెంట్ చేయలేరు. పొత్తును అంగీకరించకపోయినా.. మోడీతో జగన్ కు సత్సంబంధాలు ఉన్నాయని సజ్జల అన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను ఆరోగ్యకరంగా నడించారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు గొప్పగా ఉంచడం కూడా చాలా గౌరవించాల్సిన విషయమే. కానీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉన్నారా? లేదంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి సఖ్యతగా ఉన్నారా? అనేది చాలా ముఖ్యం. అది పక్కన పెడితే.. మోడీ, జగన్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని చెప్పడమే అనుమానాలకు తావిస్తోంది.

జగన్, మోడీ మధ్య అండర్ స్టాండింగ్ ఉందని ఈ ఐదేళ్ల వైసీపీ పాలన చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. కానీ, ఎన్నికల సమయంలో టీడీపీతో, బీజేపీ పొత్తులో ఉన్నపుడు సజ్జల అలా మాట్లాడటం వ్యూహాత్మక తప్పిదం అవుతుంది. ఎందుకంటే.. తనకు ఎంపీ టికెట్ రాకుండా జగన్ కుట్ర చేశారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఇప్పుడు సజ్జల కామెంట్స్ చూస్తే రఘురామకృష్ణంరాజు ఆరోపణలకు బలం చేకూరేలా ఉన్నాయి కదా.

ఇది పక్కన పెడితే.. మరో కామెంట్ కూడా సజ్జల చేశారు. కేసీఆర్ చేసిన తప్పులను జగన్ చేయలేదని అన్నారు. అందుకే వైసీపీని ప్రజలు మరోసారి ఆదరిస్తారని చెప్పారు. కేసీఆర్ ప్రస్తావన తీసుకురావడమే సజ్జల చేసిన పెద్ద తప్పు. వైసీపీ గత ఐదేళ్లలో ఏం చేసిందో చెప్పుకుంటే తప్పులేదు. కానీ.. కేసీఆర్ చేసిన తప్పును తాము చేయలేదని అన్నారు. నిజానికి కేసీఆర్ కూడా పెద్ద ఎత్తును సంక్షేమ పథకాలను అమలు చేశారు. దళిత బంధులాంటి పథకాల విషయంలో అందరికి ఇవ్వకపోవడం కేసీఆర్ పై వ్యతిరేకత వచ్చింది. పైగా పదేళ్లు అధికారంలో ఉంటే ఎవరిపై అయినా సహజంగా ప్రజలకు విరక్తి వస్తుంది. దీనికి తోడు త్రిముఖ పోరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్యలో కూడా బీఆర్ఎస్ కు ఘోర ఓటమి రాలేదు. 39 స్థానాలను కేసీఆర్ గెలిపించుకున్నారు. కాంగ్రెస్ కు కేవలం మ్యాజిక్ ఫిగర్ కంటే 4 స్థానాలే ఎక్కువ వచ్చాయి. అన్నింటికి మించి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే ఓ ప్రచారాన్ని కాంగ్రెస్ బలంగా జనంలోకి తీసుకొని వెళ్లింది. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయింది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కేసీఆర్ కు తక్కువ మార్కులేం పడలేదు.

కేసీఆర్ చేసిన తప్పులను జగన్ చేయలేదంటే.. సంక్షేమం విషయంలో అందరికి అన్ని పథకాలు అందించామనేది సజ్జల ఉద్దేశం. కానీ, కేసీఆర్ కొన్ని పథకాలకు కోత పెట్టాడని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే, జనం అక్కడితో ఆగిపోతారనుకుంటే సజ్జల పొరపాటు అవుతుంది. సంక్షేమంతో పాటు కేసీఆర్ చేసిన అభివృద్ది కూడా చూస్తారు. ఐటీ మినిష్టర్ గా తెలంగాణకు కేటీఆర్ ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చాడో అందరం చూశాం. మరి ఏపీలో ఐటీ మినిష్టర్ ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చారు? సజ్జల కామెంట్స్ తో ఏకంగా రెండు రాష్ట్రాలు గత ఐదేళ్లలో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగాయో చూస్తారు. మరి సజ్జల ఏ ఉద్దేశంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారో తెలియదు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -