Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి ఘోర అవమానం.. బ్రతిమాలుకున్నా జనం మాత్రం మాట వినలేదుగా!

Vijayasai Reddy: రాజకీయ నాయకుడికి, రాజకీయ వ్యూహకర్తకు, పోల్ మేనేజ్మెంట్ చేసేవాళ్లకు చాలా తేడాలు ఉంటాయి. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఆయన పొలిటికల్ లాబీయింగ్, పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ బాగా చేస్తారు. కానీ, జగన్ ఆయన్ని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. విజయసాయిరెడ్డి ప్రచారాని వెళ్తే అడుగడుగునా ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఉదయగిరిలో ఆయనకు ఘోర అవమానం జరిగింది. సీతారామపురంలో ప్రచారం రథంపై ఆయన ప్రసంగం మొదలు పెట్టకుండానే ప్రజలు వెళ్లిపోతున్నారు. దీంతో.. వైసీపీ నేతలు ఆగండి.. ఆగండి బోజనాలు ఉన్నాయి.. తిని వెళ్లండి.. కాసేపు వెనక్కి రండి అని పిలుస్తున్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడేవరకూ ఆగండమ్మ రండీ అని పిలుస్తున్నారు. ఈ వీడియోలు చూసిన వారికి ఎవరైకా మొదటి నవ్వు వస్తుంది. తర్వాత విజయసాయిరెడ్డిపై జాలి అనిపిస్తుంది. విజయసాయిరెడ్డి చాలా తెలివైన వ్యక్తి. ఆయన ఓ ఎంపీ అభ్యర్థి కాదు. వెనకుండి పార్టీని నడిపించే సామర్థ్యం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ప్రజల నుంచి ఇలాంటి అవమానం రావడం నిజంగా ఎవరికైనా జాలి అనిపిస్తుంది.

అయితే విజయసాయిరెడ్డిపై వ్యూహాత్మకంగా పార్టీలో కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న విషయాలను గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. పార్టీలో విజయసాయిరెడ్డికి, సజ్జల రామకృష్ణరెడ్డికి పడదు. జగన్ తర్వాత పొజిషన్ కోసం ఇద్దరూ పోటీ పడుతూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు రెండో స్థానంలో విజయసాయిరెడ్డి పేరు వినిపించింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో సజ్జలే అన్ని తానై చూసుకుంటున్నారు. మధ్యలో ఓ ఏడాదిపాటు విజయసాయి రెడ్డి పార్టీలో ఉన్నారా? లేదా అన్నట్టు వ్యవహరించారు. కానీ, ఆయన్ని రీజినల్ కోర్డినేటర్ గా నియమించిన తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే.. మళ్లీ విజయసాయి రెడ్డి యాక్టివ్ అవ్వడం సజ్జలకు ఇష్టం లేదు. అందుకే ఆయన తన ఆపరేషన్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

సజ్జల ఒత్తిడితోనే విజయసాయి రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. అక్కడ ఆయన గెలిచే అవకాశం లేదు. నిజానికి నెల్లూరు విజయసాయిరెడ్డి సొంత జిల్లా అయినా అక్కడ ఆయనకు పెద్దగా పరిచయాలు లేవు. అందులోనూ నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ వైసీపీలో కీలక నేతలంతా టీడీపీ గూటికి చేరారు. ఇక… మంత్రి కాకాణి గోవర్దన్ ఉన్నారంటే.. ఆయన సజ్జల మనిషి. సజ్జల డైరక్షన్ లోనే ఆయన నడుస్తారు. దీంతో.. కాకాణి సహకారం కూడా విజయసాయి రెడ్డికి లేదు. గతంలో మంత్రిగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ నర్సారావు పేట ఎంపీగా పోటీ చేస్తున్నారు కనుక ఆయన తన వ్యవహారాలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డితో ఉన్నది జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే. రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న సజ్జల… కనీసం ఢిల్లీలో కూడా విజయసాయిరెడ్డికి అవకాశం లేకుండా చేయాలని అనుకుంటున్నారని టాక్. అందుకే ఎంపీగా విజయసాయిరెడ్డిని ఓడిస్తే.. ఢిల్లీ వ్యవహారాలు కూడా ఊడిపోతాయని సజ్జల వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగానే సజ్జల ఆయన సభలకు ఎవరిని హాజరుకానివ్వకుండా అడ్డుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఓ వైపు ఎలాగూ ప్రత్యర్థి పార్టీ ఆయనపై పోరాటం చేస్తుంది. దీనికితోడు స్వపక్షంలో విపక్షాన్ని కూడా నెట్టుకొని రావడం విజయసాయిరెడ్డికి తలకు మించిన భారం అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -