Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలు లేవా.. అసలు లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Telangana Congress: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది అయితే త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అనేలా పోటీ ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎంతో మంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఈ క్రమంలోనే బిఆర్ఎస్ పార్టీకి ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అయితే ఈయన కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన కుమార్తె డాక్టర్ కడియం కావ్యకు ఏకంగా పార్లమెంటు సీటు ఇచ్చి తనను గెలిపిస్తామంటూ వరాలు కురిపించింది.

కడియం కావ్య వరంగల్‌ నుంచి పోటీకి దిగబోతున్నారని దీంతో ఆమె గెలుపు ఖాయం అని చెబుతున్నారు. ఈమెకు ప్రత్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తాటికొండ రాజయ్య లాంటి బలమైన అభ్యర్థిని నిలబెడితే పోటీ తీరు వేరేగా ఉంటుందన్నది అంచనా. ఏది ఏమైనా ఎప్పటినుంచో అధికారంలోకి రావాలి అనుకుంటున్నటువంటి కావ్యకు ఇదొక మంచి శుభ పరిణామం అనే చెప్పాలి.

మరోవైపు తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం జంప్‌ జిలానీ అనిపించుకోడానికి కడియం శ్రీహరి సిద్ధపడటం కలిసొచ్చింది. ఇలా వేరే పార్టీ నుంచి తన పార్టీలోకి ఆహ్వానించి మరి ఈమెకు టికెట్ ఇవ్వడంతో సొంత పార్టీ నేతలు కాస్త అలిగారు దీన్నిబట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలు లేవా లేకపోవడంతోనే బయట పార్టీ నుంచి ఇలా అరువుకు తెచ్చుకొని మరి పోటీ చేస్తున్నారా అన్న సందేహాలు ప్రత్యర్థులలో మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌లో ఎంపీ స్థానాలకు పోటీ చేయగల బలమైన అభ్యర్థులు లేరా? ఈరకమైన గుసగుసలు సాగుతూనే వున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Ys Jagan- Ys Bharathi: భారతికి జగన్ విడాకులు ఇస్తారా.. వైరల్ అవుతున్న బాబు సంచలన వ్యాఖ్యలు!

Ys Jagan- Ys Bharathi: ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా క్లాస్ గా మాట్లాడేవారు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో అయినా లేదంటే ఏదైనా సభలు సమావేశాలలో అయినా కూడా...
- Advertisement -
- Advertisement -