Janasena: జనసేనలోకి ప్రముఖ కమెడియన్? జగన్ కు బిగ్ షాక్?

Janasena: ఏపీ రాజకీయాల్లో ఇప్పటినుంచే అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు ఇప్పటినుంచే రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటినుంచే సీటు ఫిక్స్ చేసుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారు. ముందు టికెట్ ఫిక్స్ చేసుకుంటే ప్రచారం జోరుగా చేసుకోవచ్చని, దాని వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని నేతలు భావిస్తున్నారు. టికెట్ పై ఏదోకటి తేల్చాలని అాధినేతలను కోరుతున్నారు. ఒక పార్టీలో టికెట్ దక్కదని భావించిన నేతలు… ఇతర పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. జంప్ అయ్యేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఎన్నికలకు ముందు రాజకీయ వలసలు మరింత పెరిగే అవకాశముంది. అయితే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలోకే కాదు.. జనసేనలోకి పార్టీలోకి కూడా వరుసలు మొదలయ్యాయి. ఏపీలో గత ఎన్నికల్లో పోలిస్తే జనసేన బలంగా బాగా పెరిగిందనే అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కూడా మరింత దూకుడు పెంచి రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. జగన్ ను ఢీకొట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ స్పీడ్ పెంచుతున్నారు. ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకునేందుకు సిద్దమవుతున్నారు.

ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష వైసీపీలో టికెట్ దక్కదనుకున్న నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఏ పార్టీలో చేరాలనే దానిపై అలీ అందరితో చర్చోపచర్చలు జరిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు వైసీపీ నేతలు, టీడీపీ నేతలను కలిశారు. దీంతో అలీ జనసేనలో చేరతారని కొద్దిరోజులు, టీడీపీలో చేరతారని కొద్దిరోజులు ప్రచారం జరిగింది.

ఆ తర్వాత చివరికి వైసీపీ పార్టీలో అలీ చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం నిర్వహించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలీకి ప్రభుత్వంలో ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారేమోనని భావించారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో జగన్ ను అలీ కలిశారు. దీంతో అలీకి రాజ్యసభ పదవిని జగన్ కన్ఫార్మ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అలీ కూడా రాజ్యసభ పదవి తనకే వస్తుందని, జగన్ కన్పార్మ్ చేశారని అలీ మీడియాకు చెప్పుకొచ్చారు. కానీ చివరికి అలీకి జగన్ షాకిచ్చారు. రాజ్యసభ జాబితాలో ఆయప పేరు లేదు.

ఆ తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి అయినా దక్కుతుందేమోనని అలీ భావించారు. కానీ ఇప్పటివరకు అలీకి ఎలాంటి పదవి దక్కలేదు. వైసీపీలో కూడా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. పార్టీ పదవులు కూడా ఆయన ఏమీ దక్కడం లేదు. దీంతో అలీ జనసేనలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనలో చేరేందుకు అలీ సిద్దమైనట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుంచి ఆయన జనసేన తరపున పోటీ చేసే అవకాశముంది. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బలం బాగా పుంచుకున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి.

ఈ కారణంతో తూర్పు గోదావరిలో జనసేన బలంగా ఉన్న ఏదైనా నియోజకవర్గాన్ని అలీ ఎంచుకునే అవకాశముంది. పవన్ కు, అలీకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన కోరుకున్న సీటును పవన్ కేటాయించే అవకాశాలున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -