Kadapa: క‌డ‌ప‌లో ఫ్యాన్ పార్టీ మాడు ప‌గిలే తీర్పు రాబోతోందా.. అలాంటి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందా?

Kadapa: ఏపీలో జగన్ సొంత జిల్లాలో అప్పట్లో కాంగ్రెస్ తప్ప మరే పార్టీ లేదు ఇది కూడా చేయలేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ 2004 సాధారణ ఎన్నికల నుంచి అసలు తెలుగుదేశం అక్కడ ఒక సీటు గెలవటమే గగనం అవుతుంది. 2004లో కమలాపురం, 2009లో ప్రొద్దుటూరు, 2014లో రాజంపేట సీటుతో సరిపెట్టుకున్న తెలుగుదేశం 2019 ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేదు. దీనిని బట్టి కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీ హవా ఎంత ? బలంగా కొనసాగుతుందో తెలుస్తోంది.
అయితే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.

ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు సానుభూతిపరులు అసలు నామినేషన్ వేయటం కూడా కష్టం అవుతుంది. కొన్నిచోట్ల బెదిరింపులు, దౌర్జన్యాలతో కూడా టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అధికార పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. అలాంటి చోట తాజాగా గ్రామపంచాయతీ ఉప ఎన్నికల్లో వైసీపీకి మాడు పగిలిపోయేలా ఓటరు తీర్పు ఇచ్చారు. ఇక్కడ ఐదు వార్డులకు ఎన్నికలు జరిగితే మూడు టీడీపీ మద్దతుదారులు విజయం సాధించడం అంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి. సిద్దవ‌టం మండలంలోని మాధవరం 1లో రెండో వార్డుకు జరిగిన ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి 26 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

 

ఇదే మండలంలోని ఉప్పరపల్లె పంచాయితీ పదవ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీ లీల 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాజుపాలెం పంచాయతీలోని తొమ్మిదవ వార్డుకు జరిగిన ఎన్నికలలో టీడీపీ బలపరిచిన ఓబులేసు 42 వాట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె 13వ వార్డు ఉప ఎన్నికలలో వైసీపీ రెబల్ అభ్యర్థి టీడీపీ బలపరిచిన హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే రాచ‌మల్లు ప్రసాద్ రెడ్డి బలపరిచిన బ్రహ్మానందరెడ్డి పై 48 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీకి మూడిందని అర్థమవుతోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -