YS Sharmila: కడపలో టీడీపీ తరపున వీక్ క్యాండిడేట్.. షర్మిల విజయానికి టీడీపీ సహకరిస్తోందా?

YS Sharmila: ఏపీ రాజకీయాలలో ఏ పార్టీలో ఏమి జరిగినా అందులో చంద్రబాబు నాయుడు హస్తం ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవంతో అలా మాట్లాడుతున్నారా లేకపోతే ఆయనని విమర్శిస్తూ మాట్లాడుతున్నారో అర్థం కాలేదు కానీ ఏపీ రాజకీయాలలో ఏ సంచలనం జరిగినా దాని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని మాత్రం తెరపైకి వస్తుంది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైయస్ షర్మిల గత ఎన్నికలలో తన అన్నయ్య విజయానికి ఎంతగానో దోహదపడ్డారు కానీ ఈ ఎన్నికలలో మాత్రం తన అన్నయ్య పై పోటీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వైఎస్ షర్మిల ప్రస్తుతం కడప ఎంపీగా పోటీ చేయబోతున్నానంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అవినాష్ కూడా స్వయంగా షర్మిలకు సోదరుడు అవుతారు ఇలా తన సోదరుడి పైన ఈమె పోటీకి దిగారు ఇలాంటి తరుణంలోనే టిడిపి నుంచి చాలా వీక్ కాండిడేట్ అయినటువంటి భూపేష్ రెడ్డి అనే వ్యక్తిని ఎంపీ బరిలోకి దింపుతున్నారు. ఈ భూపేష్ రెడ్డి జమ్మలమడుగు వాస్తవ్యులు తప్ప అతని పేరు పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు. ఈయన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తమ్ముడు నారాయణరెడ్డి కుమారుడు. ఈయన ఇన్ని రోజులు జమ్మలమడుగు ఇన్చార్జిగా వ్యవహరించారు అయితే ఈయనని కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు నిలబెట్టబోతున్నారని తెలుస్తుంది.

ఇలా కడపలో వీక్ కాండిడేట్ అయినటువంటి టిడిపి అభ్యర్థిని నిలబెడితే ఆ ఓట్లు అన్ని కూడా షర్మిలకే వెళ్తాయని భవిష్యత్తులో కడపలో తమ పార్టీని బలోపేతం చేయడానికి వీలు కుదురుతుందన్న దూర దృష్టితో చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే వీక్ కాండిడేట్ ను పోటీకి దింపి పరోక్షంగా షర్మిల విజయానికి కారణం అవుతున్నారని తెలుస్తోంది. కడపలో వైసీపీ పార్టీతో పోటీ అంటే ఆషామాషీ కాదు అయితే ఓకే కుటుంబం నుంచి అన్న చెల్లెలు ఈ పోటీకి దిగడంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా ఉందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -