Jagan Reddy: జగన్ రెడ్డి కడపకు వెళ్లొచ్చాక సీన్ మొత్తం మారిపోయిందే.. అక్కడ ఏం జరిగిందంటే?

Jagan Reddy: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున టిడిపిలోకి వైఎస్ఆర్సిపి నేతల చేరికలు మొదలయ్యాయి. ఇప్పటికే ఎంతోమంది కీలక నాయకులు వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు అయితే కడప వైఎస్ఆర్సిపి పార్టీకి అడ్డాగా ఉందని చెప్పాలి ఇలాంటి చోటే వైసిపి నుంచి ఎంతోమంది కార్పొరేటర్లు బడా నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప పర్యటనకు వెళ్లిన తర్వాత అక్కడ సీన్ మొత్తం మారిపోయింది పార్టీ కోసం ఎన్నో డబ్బులను ఖర్చు చేసి ఎంతో కష్టపడి చేసినటువంటి కార్పొరేటర్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఏమాత్రం గుర్తుపెట్టుకోవడం లేదని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అంజద్ భాష వ్యవహార శైలి పట్ల నేతలందరూ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తిని బయటపెట్టారు.

కడప వైసీపీ నేతల్లో ఉన్న గూడుకట్టిన అసమ్మతి గుర్తించిన డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అండ్‌ కో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థంకాక అయోమయంలో పడ్డారని.. అభద్రతాభావంతో ఉండిపోయారు ఎన్నికలలో వార్ వన్ సైడే గెలుపు మాదేనని భావించినటువంటి డిప్యూటీ సీఎం ఇప్పుడు గెలుస్తానా లేదా అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. వైసీపీ కార్పొరేటర్లలోనే మనస్పర్ధలు, అనుమాన పొరపొచ్చాలు రావడంతో.. ఆ పార్టీలో ఒకరంటే ఒకరికి అపనమ్మకం ఏర్పడే పరిస్థితి వచ్చింది.

గత ఎన్నికలలో కడపలో ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా కడపలో విజయం సాధించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవీరెడ్డిని ఐదు నెలల క్రితం ఇన్‌చార్జిగా ప్రకటించారు. ఇటీవలే అభ్యర్థిగా ప్రకటించారు. అయితే వచ్చినప్పటి నుంచి ఆమె కడప అసెంబ్లీలో బాగా చుట్టేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వైసిపి అలాగే డిప్యూటీ సీఎం అంజద్ భాష వైఫల్యాలను వివరిస్తూ రావడంతో టీడీపీకి పోటీ స్థాయిలో మద్దతు పెరిగింది మరి ఈసారి కడపలో కూడా వైసిపికి కష్టమేనని స్పష్టంగా అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -