YS Sharmila: త్రిముఖ పోరుకు తెరలేపిన షర్మిల.. ఎన్నికల సమయంలో ఇది అస్సలు ఊహించలేదుగా!

YS Sharmila: వయసు షర్మిల ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే ఈమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు కాస్త స్తబ్దతగా ఉన్నటువంటి షర్మిల ఎన్నికల సమీపిస్తున్నటువంటి తరుణంలో ఎవరు ఊహించనీ విధంగా రాజకీయాలలో పావులు కదలిస్తున్నారు.

ఎన్నికలలో ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో బహుశా పోటీ ఉండదేమో అని అందరూ భావించారు కానీ ఈమె అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నాం అంటూ సంచలన విషయాలను వెల్లడించారు.షర్మిల కడపను టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో… టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి వర్సెస్ వైసీపీ పోరును త్రిముఖ పోరుగా మార్చి ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తుంది.

ఇలా షర్మిల అనుషంగా తాము కూడా ఎన్నికల బరిలో ఉండబోతున్నామని తెలియజేయడమే కాకుండా ఈమె కడప లోక్ సభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో షర్మిల అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగితే ఎవరి ఓటు బ్యాంకు చీలుతుందోననే చర్చలు మొదలయ్యాయి.

త్వరలో జరగబోయే ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం విషయానికొస్తే… ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ నుంచి జమ్మలమడుగు ఇన్ ఛార్జ్ భూపేశ్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఇలా వీరిద్దరి మధ్య పోటీ ఉన్నటువంటి తరుణంలో అనూహ్యంగా షర్మిల పేరు కూడా తెరపైకి రావటం విశేషం. అంతేకాకుండా ఈమె 9 గ్యారెంటీ పథకాలను కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే కడపలో ఈ ఎన్నికలు కాస్త కీలకంగానే మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -