Samantha: సమంత లిప్ లాక్ సీన్లు చేస్తే తప్పేంటి.. సామ్ ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా థియేటర్ లో ప్రదర్శితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా చూసిన తర్వాత అక్కినేని ఫ్యాన్స్ సమంత పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. కేవలం ఇప్పుడు అనే కాకుండా నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ప్రతిసారి ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఖుషి సినిమా చూసి కొంతమంది సమంత పై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. మీడియా ముందుకు వచ్చి సమంతాను తెగ తిట్టిపోస్తున్నారు. సమంత రొమాంటిక్ సీన్లో నటించింది అన్న ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంది. సమంత బెడ్ రూమ్ సీన్స్ లో నటించింది అంటూ ఫీల్ అవుతున్నారు కొంత మంది అక్కినేని ఫ్యాన్స్. నీ వెనకాల అక్కినేని ఫ్యామిలీ ఉండగా నువ్వు ఎలా ఇలాంటి సీన్స్ చేస్తావు అంటూ ఆవేశపడుతున్నారు. సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ అత్యుత్సాహ వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇది విన్న ఎవరికైనా ఏంటిది అనిపించక మానదు.

సమంతకు విడాకులు అయిపోయాక తన లైఫ్ తను లీడ్ చేసుకుంటోంది. ఇంకా తనను అక్కినేని హీరోయిన్ లా చూడటంలో ఎలాంటి అర్ధం లేదు. ఇప్పుడు సమంత విడాకులు తీసుకొని విడిపోయింది మరి తన లైఫ్ తాను బతుకుతుంది తనకి ఇష్టం వచ్చినట్టుగా తాను బతుకుతోంది అలాంటప్పుడు మీరు విమర్శించడంలో అర్థం లేదు అని సమంత అభిమానులు అక్కినేని అభిమానుల పై మండిపడుతున్నారు. అలాగే నాగచైతన్య థాంక్యూ సినిమాలో లిప్ లాక్ సీన్లు రొమాంటిక్ సీన్ లలో నటించినప్పుడు తప్పు కనిపించలేదా అంటూ కొందరు మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -