Pawan Kalyan: ఆ టైటిల్ పట్ల అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్.. మరేమి దొరకలేదా అంటూ?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలసి ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విషయం తెలిసిన ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు కానీ అంతలోనే వారికి నిరాశపరిచే ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాకి బ్రో అనే టైటిల్ పెట్టారంట మూవీ మేకర్స్.

 

ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే లోపే సినీ ప్రియుల చెవిన పడింది. టైటిల్ రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే ఈ పేరు బయటికి వచ్చినట్లుగా సమాచారం. అయితే టైటిల్ విన్న సినీ ప్రియులు టైటిల్ పెద్దగా బాగోలేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టైటిల్ మార్చమంటూ తెగ హడావుడి చేస్తున్నారు.

 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో నటిస్తున్నాడంట. సాయి ధరంతేజ్ కు లైఫ్ లో మరొక ఛాన్స్ ఇస్తాడు. అప్పుడు సాయిధరమ్ తేజ్ లైఫ్ లో ఏం జరిగింది అనేది మూవీ కాన్సెప్ట్. నేను కాలాన్ని అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందంట. జీవితంలో సాయి ధరంతేజ్ కి మరొక అవకాశాన్ని ఇచ్చి సాయపడే పాత్రలో కనిపిస్తాడంట పవన్ కళ్యాణ్.

 

కేతిక శర్మ, ప్రియ వారియర్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా కి జి స్టూడియో సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ టైటిల్ బాలేదు బ్రో, మార్చండి బ్రో, ఏం టైటిల్ బ్రో అంటూ బ్రో అనే పదాన్ని రకరకాలుగా వాడుతున్నారు సినీ జనాలు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -