పాపం పసిపిల్లలు.. భార్యపై అనుమానంతో దారుణం..

పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ ఉంటుంది. తమ పిల్లల కోసం వారు నానా కష్టాలు పడుతుంటారు. ఒక్కపూట వారు అన్నం తినకున్నా తమ పిల్లలకు మూడు పూటల అన్నం పెట్టి పోషిస్తుంటారు. కాని కొందరు క్షాణికావేశం అనుమానం పిల్లలపై చూపి వారిని అనథలుగా చేస్తున్నారు. ఇక తండ్రి అయితే బిడ్డలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాడు. తనకు ఎలాంటి సౌకర్యాలు లేకున్న.. బిడ్డలకు అన్ని అవసరాలు తీరేలా నిరంతరం శ్రమిస్తుంటాడు. అయితే కొందరు తండ్రులు మాత్రం భార్యలపై అనుమానంతో పిల్లలపై దారుణాలకు తెగ బడుతుంటారు. తాజాగా తన ఓ కర్కశ తండ్రి ఇద్దరి బిడ్డలను రాత్రి అడవుల్లో వదిలేసి వచ్చిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

కర్నూలు జిల్లాలోని కోడుమూరులో ప్రాంతంలో ఉంటున్న కష్ణ అనే వ్యకి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యపై ఉన్న అనుమానంతో అప్పుడప్పుడు పిల్లలపై కోపం పెంచుకున్నాడు. తన భార్యపై అనుమానంతో కష్ణ పిల్లలను ఆటోలో తీసుకెళ్లి అడవిలో వదిలేందుకు సిద్ధమయ్యాడు. అయితే అడవికి వెళ్లే మార్గం మధ్యలో పాలకుర్తి సమీపంలో ఆటోతో సహా పిల్లలను కాలువలో పడేసి పరారయ్యాడు. కాలువలో నీరు లేకపోవడంతో ఇద్దరు పిల్లలు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అక్కడ ఇద్దరు పిల్లలు కొద్దిసేపు బిక్కు, బిక్కుమంటూ గడిపారు.

కాలువలో పడిపోయిన ఇద్దరు పిల్లల ఏడుపుల్ని విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాలువలో ఉన్న ఇద్దరు పిల్లలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పిల్లలను కాలువు లో పడేసిన వారి తండ్రిపై కేసు నమోదు చేశారు.అతడి కోసం గాలిస్తున్నారు. సొంత బిడ్డలపై ఇంత దారుణంగా ప్రవర్తించిన తండ్రిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: జగన్ పై ఎక్కడ దాడి జరిగినా కుట్ర బాబే చేశారా.. బాబును ఓడించాలనే కుట్రలా?

YS Jagan: తనపై జరిగిన గులకరాయి దాడిపై సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు. గుడివాడలో సోమవారం సాయంత్రం జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. దేవుడు దయవలన రాయి కంటి దగ్గర,...
- Advertisement -
- Advertisement -