Fight: వరుడిని చావగొట్టిన వధువు..పెళ్లి వేడుకపై బిగ్ ఫైటింగ్

Fight: సోషల్ మీడియాలో ఇప్పుడు రకరకాల వీడియోలు వైరల్ అవతున్నాయి. రోజూ ప్రపంచంలో ఏ మూలన జరిగిన సంఘటన అయినా నెట్టింట ఇట్టే ప్రత్యక్షమైపోతోంది. అందులోనూ ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వీడియో ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధూవరులు గొడవ పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడుముళ్లు వేసి ఏడడుగుల బంధంతో ఒక్కటైన ఓ జంట అందరి ముందే గొడవకు దిగింది.

 

కుటుంబీకులు, స్నేహితుల, చుట్టాల మధ్య కొత్త జీవితానికి ఓ జంట స్వాగతం పలికింది. పెళ్లి తంతు ముగిసింది. ఆ తర్వాత కొన్ని తతంగాలు ఉంటాయి కదా. వాటిలో భాగంగా స్టేజ్‌పై కొత్త జంట ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవాల్సి ఉంది. అలా వరుడు తన భార్యకు ప్రేమతో స్వీట్ తినిపించాలని చూశాడు. అయితే ఏమైందో ఏమోగానీ వధువు మాత్రం ఆ స్వీట్ ను తినడానికి ఒప్పుకోలేదు. స్వీట్ తినకుండా బెట్టు చేసింది. వరుడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ఆమెకు బలవంతంగా స్వీట్ ను తినిపించాలని చూశాడు.

 

ఆ సమయంలో వధువు భద్రకాళిలా మారిపోయింది. వరుడి చేతిని పక్కకు నెట్టేసి చెంపపై లాగిపెట్టి కొట్టింది. అందరి ముందూ వధువు చేయిచేసుకోవడంతో వరుడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆ కోపంలో వధువు రెండు చెంపలను వాయించేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు.

 

అప్పటి వరకూ ఆనందంగా ఉన్నవారు కొత్త జంట ఘర్షణ పడటంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అసలేం జరుగుతుందో తలుసుకునేలోపు వధూవరుల యుద్ధం ఇంకాస్త పెరిగిపోయింది. పక్కనున్న వాళ్లంతా వారిని ఆపాలని ప్రయత్నించినా ఫలితం ఉండదు. అప్పటిదాకా ఎంతో సందడిగా జరిగిన పెళ్లి వేడుక వధూవరుల గొడవతో ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -