Kohli: కింగ్ కోహ్లీ ఖాతాలో మరో ఐదు రికార్డులు

Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ సారథి విరాట్ కోహ్లీ కొత్త ఏడాదిలో సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్నాడు. మైదానంలో పరుగుల వరద పారిస్తూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. శతకాల మీద శతకాలు కొడుతూ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌‌తో కోహ్లీ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. రెండు సెంచరీలతో విమర్శకుల నోళ్లు మూయించాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో అద్భుత సెంచరీతో పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.

సొంతగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్‌ గా కోహ్లీ రికార్డులకెక్కాడు. స్వదేశంలో కోహ్లీకి ఇది 21వ వన్డే సెంచరీ. 20 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. అలానే అత్యధికంగా సెంచరీలు చేసి నాటౌట్‌‌గా నిలిచిన జాబితాలో కోహ్లీ (16 సార్లు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. సచిన్ (15 సార్లు) రికార్డును అధిగమించాడు.

ఇది కోహ్లీకి అంతర్జాతీయ కెరీర్‌లో 74వ సెంచరీ. అయితే 74 అంతర్జాతీయ సెంచరీలు చేయడానికి టెండూల్కర్ 556 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. కోహ్లీ మాత్రం 543 ఇన్నింగ్స్‌‌లలోనే ఆ రికార్డును సాధించాడు. దీంతో అత్యంత వేగంగా 74 శతకాలు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఇందులో 27 టెస్టు సెంచరీలు, 46 వన్డే సెంచరీలు, ఒక టీ 20 సెంచరీ ఉన్నాయి.

శ్రీలంకపై అత్యధిక సెంచరీల రికార్డు
శ్రీలంకపై విరాట్ కోహ్లీ మొత్తంగా 10 సెంచరీలు చేశాడు. ఈ విధంగా ఒకే టీమ్‌‌పై 10 సెంచరీలు చేసిన బ్యాటర్‌‌గా నిలిచాడు. అలానే శ్రీలంకపై అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధోనీ తర్వాత రెండో స్థానంలో కోహ్లి ఉన్నాడు. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మొత్తంగా కోహ్లి 259 వన్డేల్లో 58.2 సగటుతో, 93.7 స్ట్రైక్ రేట్‌ తో 12,754 పరుగులు చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -