Celebrities: ఈ సెలబ్రిటీల సంపాదన ఎంతో తెలిస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

Celebrities: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ బాగా క్యాష్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇలా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సెలబ్రిటీలు చుట్టూ పలు బ్రాండింగ్ కంపెనీలు ప్రదక్షిణలు చేస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే ఏ సెలబ్రెటీ కైతే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అలాంటివారికి తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలి అంటూ భారీగా ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక్క పోస్టును సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో కొన్ని కోట్ల రూపాయలను అందుకుంటున్నట్లు సమాచారం.మరి ఈ సెలబ్రిటీలు ఒక్క పోస్టుకు తీసుకొనే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.

 

ఇండియన్ క్రికెటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో విరాట్ కోహ్లీ ఒకరు. విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఏకంగా 250 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఇలా ఇంతమంది ఫాలోవర్స్ కలిగి ఉన్నటువంటి ఈయన తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయాలంటే సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఒక పోస్ట్ కు 5 కోట్లు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

 

విరాట్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒకరు. ఆమె ఒక్కో బ్రాండింగ్ పోస్టుకు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయ‌ల‌ను చార్జ్ చేస్తూ ఉంది. ఇక శ్ర‌ద్ధాక‌పూర్, అలియా భ‌ట్ లు కూడా కోటిన్న‌ర నుంచి రెండు కోట్ల రూపాయ‌ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక వీరి తర్వాత కత్రినా కైఫ్ సైతం ఒక్కో పోస్టుకు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వీరికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -