Relationship: ఈ సమస్యలు ఉన్నాయా.. అయితే సెక్స్‌లో ఎంజాయ్‌ చేయలేరట.. ఇలా చేయండి!

Relationship: శృంగారంలో పాల్గొనాలంటే అందరూ ఇష్టపడుతారు. అది మనిషి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. శృంగారంలో పాల్గొనడంతో ఆరోగ్యగంగా ఉంటారని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. నేటి కాలంలో చాలా మంది రోజువారి పనులు, ఆఫీసులో ఒత్తిడి, ఆందోళన తదితర వాటితో శృంగారంలో సరిగా పాల్గొనక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ సమస్యను పురుషుల్లో త్వరగా బయటçపడటం లేదు. అయితే ఆస్పత్రికీ వెళ్లి చెప్పలేక పోతున్నారు. ఈ కారణంగా ఆ సమస్య అలాగే ఉండి శృంగారాన్ని వారు అనుకున్న అనుభూతిని పొందలేకపోతున్నారు. దంపతులిద్దరూ శృంగారంలో పాల్గొనేటప్పుడు ఓ అనుభూతిని ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు మగాళ్లు ఆ సమయంలో సెక్స్‌ బలహీనతలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా వీర్యం రాకపోవడం, అకాల స్కలనం, ఇన్‌ఫెర్టిలిటీ, శీఘ్రస్కలనం, సెక్స్‌పై ఆసక్తి తగ్గిపోవడం లాంటివి జరగుతుంటాయి. శృంగారంలో చాలా సేపు పాల్గొనాలనే ఆసక్తి ఉన్నా అది సాధ్యమవకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు.

1. అంగ స్తంభనం: ఈ సమస్య ప్రధానంగా చాలా మందిలో కనిపిస్తున్నది. చాలా సందర్భాల్లో థైరాయిడ్‌ తగ్గుదల, షుగర్, బీపీతో ఈ సమస్య లింక్‌ అయి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

2. సెక్స్‌పై ఇంట్రెస్ట్‌ తగ్గడం: చాలా మందిలో సెక్స్‌ కోరికలు బాగా తగ్గుతుంటాయి. దీనికి ప్రధాన కారణం టెస్టోస్టిరాన్‌ తగ్గిపోవడం. దీని వల్లనే పురుషుల్లో సెక్స్‌ కోరిక సన్నగిల్లిపోతుంది. ఒత్తిడి, అతిగా ఆలోచించడం, పని ఒత్తిళ్ల కారణంగా వల్ల టెస్టోస్టిరాన్‌ తగ్గిపోతుంది.

3.శీఘ్ర స్కలనం: ఇది చాలా మంది పురుషులను ఇబ్బంది పెట్టే సమస్య. ఇది ఇబ్బందికి గురి చేయడమే కాకుండా మగవారి అహాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ రకమైన సమస్య అధిక వేడి శరీరం ఉన్న పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి తొలగిపోవాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సలహాలు చేస్తున్నారు.

4. నపుంసకత్వం: స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువ ఉండటం. ఈ సమస్య ఉన్న వారి ద్వారా గర్భం రావడం, పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్య కనిపించగానే వైద్యులను సంప్రదించి స్పెర్మ్‌ కౌంట్‌ పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జీవనశైలి గురించి సలహాలు పొందడం శ్రేయస్కరం. పురుషుల్లో హర్మోన్ల సంఖ్య పడిపోవడం, సెక్స్‌వల్‌ డిస్‌ ఫంక్షన్‌ అనే సమస్య ఇలా అనేక ఒత్తిళ్ల వల్ల తలెత్తుతుంది.

5.అకాల స్కలనం: ఈ సమస్య ఎక్కువగా యువతలో కనబడుతుందట. ఈ సమస్య మధ్య వయస్కుల్లో కూడా వస్తుందని యూరో ఆండ్రాలజిస్టులు పేర్కొంటున్నారు. ఈ అకాల స్కలనం కారణంగా అంగ స్థంభన రావడానికి మొదటి లక్షణమని చెప్తున్నారు వైద్య నిపుణులు.

కారణాలు ఇవే..

మధుమేహం, కొలెస్ట్రాల్, రక్తపోటు శారీరక జబ్బులు ఉండటం సెక్స్‌ జీవితంపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. సైకలాజికల్‌ స్ట్రెస్‌ కారణంగా కూడా శృంగారా జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. ఆర్థిక సమస్యలు కారణంగా కొందరు డిప్రెషన్‌కు లోనైన సందర్భాల్లో కూడా సెక్స్‌ను ఆస్వాదించలేకపోతున్నారు. ఒత్తిడిని దూరం చేసుకుంటే సెక్స్‌లో దంపతులు అనుకున్న రీతో ఆస్వాదించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -