ఒకే నెలలో రానున్న నలుగురు స్టార్ హీరోలు… పోటీ మామూలుగా ఉండదుగా?

గత మూడు సంవత్సరాల నుంచి కరోనా ప్రభావం వల్ల పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా వాయిదా పడుతూ ప్రస్తుతం ఈ సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా తగ్గిపోవడం వల్ల థియేటర్లకు తిరిగి పూర్వ వైభవం వచ్చింది.ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్లో పెద్ద హీరోల సినిమాలను విడుదల చేస్తూ కలకలలాడుతూ ఉండగా బాలీవుడ్ మాత్రం ఇంకా ఈ పరిస్థితుల నుంచి బయట పడలేదని తెలుస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన వరుస సినిమాలు విడుదలవుతూ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందుకుంటున్నాయి.అదేవిధంగా మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోల సినిమాలు కూడా త్వర త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటూ విడుదలకు సిద్ధమవుతున్నాయి. సాధారణంగా ఏదైనా పండుగలు వస్తే సినిమా జాతర ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే నెల దసరా కానుకగా పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా మరికొన్ని స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో మాత్రం సినీ ప్రేమికులకు పెద్ద జాతర అని చెప్పాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే నెలలో ఏకంగా నలుగురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ బరిలో పోటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 2023 ఏప్రిల్ నెలలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

ఇకపోతే 2023 ఏప్రిల్ 28వ తేదీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా పక్కా విడుదలవుతుందని విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ తేదీని మహేష్ బాబు ఎట్టి పరిస్థితులలో కూడా మిస్ చేసుకోరని తెలుస్తోంది.ఆరోజు మహేష్ బాబుకు ఎంతో సెంటిమెంట్ అని అందుకే అదే రోజున త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తాను చేయబోయే సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాని కూడా 2023 ఏప్రిల్ 14వ తేదీ విడుదల చేయనున్నట్లు తాజాగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి కనుక ఈ సినిమా విడుదల విషయంలో కూడా ఏ విధమైనటువంటి మార్పు ఉండదని తెలుస్తోంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హరిహర వీరుమల్లు సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే విడుదల కాబోతుందనీ దర్శకుడు వెల్లడించారు.వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కాబోతుందని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏది ఏమైనా ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా నలుగురు స్టార్ హీరోలు పోటీకి దిగడంతో అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పవచ్చు. మరి ఈ నలుగురిలో ఎవరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -