Bro Movie: పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా బ్రో మూవీ.. మిగతా అభిమానులకు మాత్రం?

Bro Movie: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..

కథ :

ఈ సినిమా మొత్తం మార్కండేయులు (సాయి ధరమ్‌ తేజ్‌) చుట్టూ తిరుగుతుంది. మార్కండేయ తండ్రి అతను చిన్న వయసులోనే చనిపోతాడు. మార్కండేయకి ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు ఉంటారు. ఇక తన తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు అన్ని అతనే తీసుకుంటారు. ఇక తాను ఉన్న బిజీ షెడ్యూల్లో అందరి దగ్గర నాకు టైం లేదు టైం లేదు అని చెబుతూ ఉంటారు. అతనికి ఇంట్లో, పని చేసే చోట మంచి పేరు, మర్యాదలు ఉంటాయి. కానీ ఒకరోజు అతను కారులో వెళుతుండగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే చనిపోతాడు. చనిపోయిన సాయిధరమ్ కు అప్పుడే దేవుడు లాంటి కాలం అనే పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ మద్దతుగా నిలుస్తాడు. మార్కండేయ చనిపోయిన తరువాత కూడా కొన్ని కండిషన్లు పెట్టి 90 రోజుల జీవితాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు మార్కండేయ తోనే కథ తిరుగుతూ ఉంటుంది. ఇక ఆ 90 రోజులు మార్కండేయ ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి తరువాత ఏమైంది అనేది మిగిలిన కథ.

 

నటీనటుల పనితీరు :

పవన్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. టైం అనే దేవుడి పాత్రలో మరోసారి తన మ్యాజిక్ చూపించాడు పవన్. ఒక 15 నిమిషాల పవన్ క్యారెక్టర్ మనల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాంగ్స్ లో మనం వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూడవచ్చు. పవన్ పక్కన సాయిధరమ్ తేజ్ కూడా తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. మావయ్యతో మొదటి సినిమా అనో ఏమో తెలియదు కానీ, తాను కూడా నటన పరంగా ఇరగదీసాడు. ఇక మిగతావారు తమ పాత్ర పరిధిలో బాగా నటించారు.

 

టెక్నికల్ పనితీరు:

కాగా ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వినోదయ సితమ్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే మన తెలుగు సినిమాకి తగ్గట్టుగా దర్శకుడు సముద్రఖని చాలా మార్పులు చేశారు. ఇందులో కొన్ని చోట్ల ఇది ఒరిజినల్ కన్నా సూపర్ గా ఉన్నా మరికొన్ని సీన్లలో మాత్రం కాస్త డల్ గా అనిపించింది. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అంతేకాకుండా పవన్ ఇమేజ్ కోసం యాక్షన్ సీన్లు పొలిటికల్ పంచ్ లు, పంచ్ డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. థమన్ అందించిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ఉన్నాయి.

 

విశ్లేషణ :

ఒరిజినల్ మూవీకి ఈ సినిమాకు చాలా తేడాలు ఉన్నాయి. ఈ సినిమాను సముద్రఖని చాలా చక్కగా తెరకెక్కించారు. మొదటి సగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే రెండో సగంలో కొంచెం ఎడిటింగ్ పదును పెట్టుంటే ఇంకా బాగుందేమో. ఈ సినిమాలోని మైనస్ లు అన్నీ కూడా తమ యాక్టింగ్ తో పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ చాలావరకు కవర్ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓల్డ్ సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

 

రే టింగ్ : 2.75 / 5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -