Electoral Bonds: లాటరీ కింగ్ నుంచి వైసీపీకి 160 కోట్ల రూపాయలు.. ఎన్నికల బాండ్ల ద్వారా వైసీపీకి ఇంత లాభమా?

Electoral Bonds: దేశ వ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై తవ్వేకొద్ది కొత్తకొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో నుంచి అంతుచిక్కని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి సమర్పించింది. అయితే.. ఈ బాండ్ల వివరాలను పరిశీలిస్తే వివాదాస్పద కంపెనీల నుంచి వైసీపీకి పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

లాటరీ కింగ్‌ అయిన ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీ అధినేత శాంటియాగో మార్టిన్‌ వైసీపీకి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ కంటే ఎక్కువ సొమ్ము వైసీపీకి అందింది. దీంతో ఇది సంచలనంగా మారుతుంది. ఏపీలో అధికార వైసీపీకి ఈ సంస్థ రూ.160 కోట్ల విరాళమిచ్చింది. కానీ.. బీజేపీకి మాత్రం 100 కోట్లు కోట్లే ఇచ్చింది. దీంతో.. కంపెనీకి, జగన్ కు ఉన్న లింకేంటి అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

లాటరీ కింగ్ అయిన ‘ఫ్యూచర్‌ గేమింగ్‌’ కంపెనీ అత్యధికంగా రూ.1368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అందులో వైసీపీకి ఏకంగా రూ.150 కోట్లను బాండ్ల రూపంలో ఇచ్చింది. దీంతో దీనిపై పెద్ద ఎత్తున గూగుల్ లో సెర్చ్ చేస్తున్నాు. ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. దీని యజమాని శాంటియాగో మార్టిన్‌. ఆయన మొదట్లో మయన్మార్‌లో కూలీగా పనిచేశారు. మయన్మార్ ననుంచి 1988లో భారత్‌కు వచ్చారు. తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలు పెట్టారు. దాన్ని కేరళ, కర్నాటకకు కూడా విస్తరించారు. ఇప్పుడు ఆ సంస్థ అధినేత మార్టిన్‌ ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ లాటరీ ట్రేడ్‌ అండ్‌ అలైడ్‌ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు.

ఈ సంస్థలే ఇప్పుడు ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో వంటివాటిని నిర్వహిస్తున్నాయి. ఫ్యూచర్ గేమింగ్ సంస్థపై చాలా వివాదాలు ఉన్నాయి. మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. చాలా సార్లు ఈడీ దాడులు కూడా జరిగాయి. ఈడీ రూ.600 కోట్లకు పైగా ఆస్తులను కూడా అటాచ్‌ చేసింది. గతేడాది గుడివాడ, హైదరాబాద్‌లో క్యాసినో వ్యవహారం వెలుగు చూసింది. వాటితో ఫ్యూచర్ గేమింగ్ సంస్థకు సంబంధాలు ఉన్నాయి. గుడివాడలో జరిగిన క్యాసినోలో మాజీ మంత్రి కొడాలి నాని పేరు జోరుగా వినిపించింది. కాబట్టి.. కొడాలి నాని ద్వారా ఆ కంపెనీ నుంచి వైసీపీ పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించిందని అనుమానాలు ఉన్నాయి. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వైసీపీకి ఆ వివాదాస్పద కంపెనేతో లింకులు ఉన్నాయనే వాళ్లు కూడా లేకపోలేదు.

ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా రూ.540 కోట్లను విరాళంగా అందాయి. తర్వాత తమిళనాడులోని డీఎంకేకు రూ.509 కోట్లను ఇచ్చింది. మూడో స్థానంలో వైసీపీ ఉంది. జగన్‌ పార్టీకి ఈ సంస్థ రూ.160 కోట్ల విరాళమిచ్చింది. బీజేపీకి రూ.100 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.50 కోట్లను విరాళంగా అందించింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -