Gautham Gambhir: ఐపీఎల్ ఆడటం ముఖ్యం కాదు.. ప్రపంచకప్ గెలవడమే ముఖ్యం

Gautham Gambhir: 2011 వన్డే ప్రపంచకప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడు, టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే వన్డే ప్రపంచకప్‌కు టీమిండియా ఆటగాళ్లు ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ సూచించాడు. ఎందుకంటే ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడం ముఖ్యమని ఆటగాళ్లు గ్రహించాలని హితవు పలికాడు. ఈ మేరకు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పలు సూచనలు చేశాడు. అవసరమైతే వన్డే ప్రపంచకప్ కోసం ఐపీఎల్ 2023 సీజన్ ఆడకుండా కీలక ఆటగాళ్లను పక్కనపెట్టాలని సూచించాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం, గత రెండు వన్డే వరల్డ్‌కప్‌లలో నిరాశ ఎదురైన నేపథ్యంలో ఈసారి పక్కా ప్రణాళిక ప్రకారం టీమిండియా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గంభీర్ అన్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్నఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలంటే టీ20ల్లో ఇవ్వాలని, వన్డేలు మాత్రం కచ్చితంగా ఆడాలని స్పష్టం చేశాడు. సరైన ప్లేయింగ్ 11తో బరిలోకి దిగితేనే విశ్వవిజేతగా నిలిచే అవకాశం ఉంటుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లపై పనిభారం ఎక్కువగా ఉంటుందని.. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని కీలక ఆటగాళ్లపై పనిభారం తగ్గించాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని గంభీర్ వ్యాఖ్యానించాడు. అందుకోసం ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నాడు. స్టార్ ఆటగాళ్లకు ఐపీఎల్ నుంచి విశ్రాంతి కల్పిస్తే పలు ఫ్రాంచైజీలు ఇబ్బంది పడొచ్చని.. కానీ భారత జట్టు ప్రయోజనాలే ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలన్నాడు.

ఐపీఎల్ ఆడకపోతే నష్టమేమీ లేదు
టీమిండియాకు చెందిన స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడకపోతే వచ్చే నష్టమేమీ లేదని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ ప్రతి ఏడాది జరుగుతుందని.. కానీ వన్డే ప్రపంచకప్ నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే జరుగుతుందని గుర్తుపెట్టుకుంటే మంచిదని గంభీర్ అన్నాడు. ఒకవేళ సదరు ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొంటే వాళ్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీలతో కలిసి నేషనల్ క్రికెట్ అకాడమీ పర్యవేక్షించాలని గంభీర్ హితవు పలికాడు. వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాల్సిన బాధ్యత బీసీసీఐపైనే ఉందన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -