David Warner – Bhuvaneshwar: దేవిడ్ వార్నర్ భువనేశ్వర్ కాళ్లపై పడటానికి కారణమిదేనా?

David Warner – Bhuvaneshwar: తాజాగా హైదరాబాద్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హోమ్ టీమ్ సన్‌రైజర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్లో తన మాజీ టీం పై విజయం సాధించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ మ్యాచ్ కి ముందు డేవిడ్ వార్నర్ చేసిన ఒక పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ భువనేశ్వర్ కాళ్లపై పడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

హైదరాబాద్ ఢిల్లీ మ్యాచ్ కోసం ఉప్పల్ వచ్చిన డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందు టాస్క్ వేసే సమయంలోమైదానంలోకి వచ్చాడు. అయితే అదే సమయంలోనే పదేళ్లపాటు హైదరాబాద్ కి బౌలింగ్ వేసినటువంటి భువనేశ్వర్ మైదానంలో కనిపించారు.

 

ఇలా భువనేశ్వర్ కనిపించే సరికి డేవిడ్ వార్నర్ ఒక్కసారిగా పరుగులు పెడుతూ భువనేశ్వర్ కాళ్లపై పడ్డారు. ఇలా డేవిడ్ వార్నర్ తన కాళ్లపై పడిపోతుండగా అప్పటికి భువనేశ్వర్ వద్దని వారిస్తున్న డేవిడ్ వార్నర్ వినకుండా తన కాళ్లకు నమస్కారం చేశారు. అనంతరం ఒకరినొకరు మనసారా హత్తుకొని సంతోషం వ్యక్తం చేశారు.

 

ఇలా తన మాజీ కెప్టెన్ చేసిన పనికి భువనేశ్వర్ షాక్ అయ్యారు అయితే అప్పుడప్పుడు స్టేడియంలోకి చేరుకున్న వేలాది మంది ఈ ఘటనను చూసి ఆశ్చర్యపోయారు.ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈ వీడియో పై వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -