CM Jagan: సీఎం జగన్ క్రికెట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారా.. ఏం జరిగిందంటే?

CM Jagan: లీగ్ క్రికెట్ కు ప్రేక్షకులలో రోజురోజుకు ఎంతో క్రేజ్ పెరిగిపోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో ప్రారంభమైనటువంటి ఈ లీగ్ క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇప్పటివరకు కేవలం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మాత్రమే ఉండేది.అయితే త్వరలోనే మరొక టీం కూడా రాబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఒక సమీక్షను నిర్వహించారు.

ఈ సమీక్షలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్ టీమ్ ఉండాలని సూచించారు. దీన్ని బట్టి చూస్తే మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్ లో మరొక జట్టు పోటీ పడబోతుందని తెలుస్తోంది. ఏపీలో మూడు క్రికెట్ గ్రౌండ్స్​ను ట్రైనింగ్, ప్రాక్టీస్ కోసం చెన్నై సూపర్ కింగ్స్​కు అప్పగిస్తాం.

 

అంబటి రాయుడు, కేఎస్ భరత్ వంటి వారు రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకం.ఒక క్రికెట్ టీం తయారు చేసుకోవడానికి వీరి సేవలను ఉపయోగించుకోవాలని సీఎం జగన్ అధికారుల కోసం సూచించారు. ప్రస్తుతం చెన్నై జట్టు సహాయం తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం త్వరలోనే ముంబై ఇండియన్స్ లాంటి జట్ల సహాయం కూడా తీసుకుంటామని తెలిపారు.

 

ఈ విధంగా సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో క్రికెట్ టీం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్ లో మరొక జట్టు పోటీకి దిగబోతుందని తెలుస్తోంది.ఇలా సీఎం జగన్ క్రీడల పైన ముఖ్యంగా క్రికెట్ పై దృష్టి పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇలా ఒక టీం ఐపీఎల్ లో పాల్గొనేలా ఏర్పాటు చేయాలి అంటూ సూచించారు.

 

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -