Geetha Arts: వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సునీత బోయ.. ఏమైందంటే?

Geetha Arts: నటి బోయ సునీత కొంత కాలంగా గీతా ఆర్ట్స్‌పై, బన్నీ వాసుపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె హల్‌ చల్‌ చేసింది. గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట నగ్నంగా నిరసనకు దిగింది. నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌పై మళ్లీ అవే ఆరోపణలు గుప్పించింది. ఈమె ప్రవర్తనను గీతా ఆర్ట్స్‌ చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈమె మానసిక పరిస్థితి బాగోలేదని తేల్చిన కోర్టు.. ఆమెను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలు కూడా ఇచ్చింది.

 

గత మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. గీతా ఆర్ట్స్‌, బన్నీ వాసు, బోయ సునీత మధ్య వివాదం కొనసాగుతోంది. ఇక ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సునీత.. బన్నీవాసుపై ఆరోపణలు కొనసాగిస్తోంది. సినిమాల్లో అవకాశం ఇస్తామంటూ తనను బన్నీ వాసు మోసం చేశాడని ఆమె ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈరోజు సునీత మరింతగా దిగజారి ప్రవర్తించింది. జూబ్లీ హిల్స్‌లో గీతా ఆర్ట్స్ ఆఫీసు ఎదుట రోడ్డుపై నగ్నంగా బైఠాయించి నిరసన తెలిపింది.

 

అయితే, అక్కడే ఉన్న ఆడవాళ్లు కొందరు ఆమెపై దుస్తులు కప్పేందుకు ప్రయత్నించారు. వాటిని ఆమె విదిలించుకుంది. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ సునీత గట్టిగా అరుస్తూ ఆరోపణలు గుప్పించింది. నాలుగు సార్లు ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లానని, తన నరాలు దెబ్బతిన్నాయంటూ వాపోయింది. ఇలా అరుస్తూ సునీత నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హల్ చల్ సృష్టించింది.

 

లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నారు..
ఇక గీతా ఆర్ట్స్‌ భద్రతాసిబ్బంది పోలీసులను సంప్రదించినట్లు సమాచారం. సునీతపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ ఎదుట సునీత ఇలా రచ్చ చేయడం పరిపాటిగా మారింది. గతంలో కూడా ఆత్మహత్యా యత్నం చేసి వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పలుమార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చినా బోయ సునీతలో మార్పు కనిపించడం లేదు. సునీత వ్యవహారంపై గీతా ఆర్ట్స్ సంస్థ గానీ, బన్నీ వాసు గానీ మీడియా ముందు మాట్లాడటం లేదు. న్యాయపరంగా చర్యలు చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -