Ginna Troll: నువ్వు వస్తావని, జంపు లకడి జారుమిఠాయి’ పాడిన వారి గురించి తెలిస్తే.. అలా ట్రోల్‌ చేయాల్సింది కాదు అంటారు!

Ginna Troll: పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం లేవగానే రైతులు వారి వారి పొలాల్లో పనిలో నిమగ్నమయ్యేవారు
కొన్ని సార్లు 15–30 మంది కలిసి ఒకేసారి పని చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా వరి నాట్లు వేయడం, కోత కోయడం చేస్తుంటారు. అల పని చేస్తున్నప్పుడు మౌనంగా ఉండకుండా వారివారికి తెలిసిన పాటలను ఒకరు పాడుతుండగా మిగతా వారు కోరస్‌ అందుకునేవారు. అలా ఆడుతూ పాడుతూ పని చేస్తే అలసట ఉండదని పనిలో మరింత ఉత్సాహం వచ్చేదని మహిళ కూలిలు పేర్కొనేవారు. ఇప్పుడంతా కాలం మారిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో జానపద గేయాలకు ఆదరణ తగ్గింది. అయితే ఇటీవల కొన్ని
సినిమాల్లో మళ్లీ గ్రామీణ ప్రాంతాల్లో పాడే పాటలకు రిమిక్స్‌ జోడించి వాటినే పాడుతున్నారు. అలాంటి గ్రామీణ పాటలే కొన్ని సినిమాలకు మంచి హిట్లు కూడా ఉన్నాయి.

 

సింగర్స్‌ పాడే పాటలు, గ్రామాల్లో పాడే పాటలకు చాలా తేడా ఉంటుంది. అయితే మనం గమనించాల్సిందే పాట అర్థం కానీ.. మ్యూజిక్‌ కాదని విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన జిన్నా సినిమా ఆడియో లాంచ్‌లో ఇద్దరు గ్రామీణ ప్రాంత మహిళలు పాగిన పాటలను చాలా మంది ట్రోల్‌ చేస్తున్నారు. సమాజంలో ఎదిగినా పాపమే.. ఎదగకున్నా పాపమే అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికీ జానపద గేయాలకు మంచి ఆదరణ ఉంది. అయితే వాటిని మరింతా ౖపైకి తీసుకురావడం ఎవరూ సాహాసించడం లేదు. జిన్నా సినిమాలో ‘జారుమిఠాయి’ అనే పాట పాడిన వారు అంతగా పరిచయం లేకున్నా పాటతో ఇద్దరు గ్రామీణ ప్రాంతాల మహిళలు భారతమ్మ, నాగరాజమ్మ సినీ ఇండస్ట్రీకి పరిచడం కావడం ఆ పాట గొప్పదనమంటున్నారు. వారిద్దరు పాటిన పాటను తెగ ట్రోల్‌ చేసేశారు. దీనిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉండూ నగరం వైపు చూడని వారు ఏకంగా వేల మంది ముందు నిలబడి పాడారంటే వారిని అభినందించాల్సింది పోయి ట్రోల్‌ చేయడం తగదన్నారు. సింగర్స్‌ అయితే తలలు పీక్కొని గొంతులు సరిచేసి ఒకటికి రెండు మూర్లు సార్లు చూసుకుని పాడితే దానికి అనుగుణంగా మ్యూజిక్‌ వాయిస్తే జనాలకు తెగ నచ్చేస్తోంది.

 

భారతమ్మ రాసుకున్న ‘జారు మిఠాయి’ నాగరాజమ్మ రాసుకున్న ‘నువ్వు వస్తావని’ లిరిక్స్‌ రెండు వేర్వేరే. వీటిని కలిపి రాసిన రైటర్‌ గణేష్, మరో మ్యూజిషియన్‌ కిషన్‌ కవాడియా.. ఇదే పాటను సినిమా కోసం పాడిన నిర్మల రాథోడ్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ ఇంతమంది కష్టాన్ని ట్రోల్స్‌ చేస్తున్నామంటే మనం సిగ్గుపడాలని నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. భారతమ్మ, నాగరాజమ్మ వీరిద్దరూ పొలాల్లో, ఇళ్ల వద్ద సొంతంగా క్రియేట్‌ చేసిన పాటలు అవి. వాళ్లు స్టేజీపై పాడటం మొదటిసారి కాబట్టి వాళ్లకు నచ్చిన విధంగా పాడారు. ఆ ఇద్దరు పాడిన పాటలు అంతగా బాగలేకపోతే దాన్ని ఇంత వరకు తెచ్చేవారు కాదు. ఆ పాటలు బాగుండటంతోనే వారిని ఇక్కడికి తీసుకొచ్చి స్టేజీపై పాడించారు. ఒకవేళ వీరిద్దరూ పాటిన పాటలను మ్యూజిక్‌ కలిపి దంచికొడితే పాప్‌ సింగర్స్‌ ముక్కులో వేలేసుకోవడం ఖాయమంటున్నారు జానపద గాయకులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -