వ్యాపారి కొడుకు కిడ్నాప్‌లో ‘పుష్ప’గ్యాంగ్‌ ప్లాన్‌

ప్రస్తుత కాలంలో డబ్బు ఆశకు ఎలాంటి పనులైనా చేయడానికి వెనకాడటం లేదు. బంధువులైనా, స్నేహితులైనా తోడపుట్టిన వారిని సైతం డబ్బు ఆశకు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరైతే మరీ కొందరైతే కిడ్నాప్‌లు, ప్రాణాలు సైతం తీస్తున్నారు. సమాజంలో డబ్బులు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది. డబ్బిస్తే చాలు ఏదైనా చేయడానికి సిద్ధమవుతున్నారు కొందరు ప్రబుద్ధులు. కేవలం పురుషులే కాదు.. మహిళలు సైతం నేరాల్లో మేమేం తక్కువ కాదని వారు కూడా ఇలాంటి చెడు పనులకు పూనుకుంటున్నారు. ఇలాంటి కిడ్నాప్‌ ఘటనే కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రభుత్వ టెండర్లు ఇప్పిస్తానని తన గ్యాంగ్‌తో ఓ మహిళ వ్యాపారి కొడుకును కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు దిగి అధిక మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. బెంగళూరుకు చెందిన రవి ఇండస్ట్రీయల్‌ సప్లై ఓనర్‌ రవి కొడుకు సూరజ్‌ తన తండ్రి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో సూరజ్‌కు పుష్పఅనే మహిళతో పరిచయం ఏర్పడింది. తాను ఓ కలేక్టర్‌ పీఏ అంటూ పుష్ప సూరజ్‌తో చెబుతుండేది. ఆ తర్వాత ఇద్దరు నాలుగైదు రోజులుగా తరచూ మాట్లాడుకునేవారు. ఒకరోజు పుష్ప సూరజ్‌తో నీకు ప్రభుత్వ టెండర్‌ ఇప్పిస్తానని నేనే చెప్పిన చోటుకు రమ్మనడంతో సూరజ్‌ గుడ్డిగా నమ్మి పుష్ప చెప్పిన చోటుకు వెళ్లాడు. వెంటనే అక్కడ ఉన్న పుష్ప తన గ్యాంగ్‌తో సూరజ్‌ కిడ్నాప్‌ చేయించింది. నిన్ను విడుదల చేయాలంటే రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది పుష్ప.

అయితే తన దగ్గర అంత డబ్బు లేదని..తన ఇంట్లో కూడా లేదని సూరజ్‌ బతిమిలాడాడు. ఆ తర్వాత సూరజ్‌ తన ఫ్రెండ్‌ గురుమూర్తికి ఫోన్‌చేసి డబ్బులు తీసుకురావాలని కోరగా గురుమూర్తి రూ. 25 లక్షలు తీసుకుని వచ్చాడు. అక్కడ సూరజ్‌ కనిపించకపోవడంతో గురుమూర్తి డబ్బులు ఇవ్వకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పుష్ప సూరజ్‌ను తన ఇంటికి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వకపోతే రేప్‌కేసు పెడుతానని బెదిరించింది. మళ్లీ గుర్తుమూర్తికి ఫోన్‌చేసి తన ఇంటి అడ్రస్‌ చెప్పడంతో అక్కడికొచ్చి రూ.25 లక్షలు ఇచ్చి వెళ్లిపోయాడు. అదేరోజు రాత్రి పుష్ప సూరజ్‌ను విడిచి పెట్టింది. ఈ విషయం బయటకు చెబితే నీ కుటుంబాన్ని చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చింది. ఎలా బయకు వచ్చిందో తెలిదు కానీ.. ఈ కిడ్నాప్‌ ఘటన బయటకు పొక్కి సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -