Yadagiri: ప్రియురాలికి వీడియోలు పిచ్చి.. ప్రియుడు ఏం చేశాడో తెలుసా?

Yadagiri: అనుమానం పెనుభూతం అని అన్నారు పెద్దలు.. ఈ అనుమానం అనే బీజం మనసులో ఒక్క సారి నాటుకుంది అంటే అది ఎంతటి దారుణానికైనా తగ్గించేలా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని కొన్ని సార్లు ఆ అనుమానం ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీయడం వరకు కూడా వెళ్ళవచ్చు. అందుకే ఎటువంటి బంధం అయినా కూడా అనుమానం అనే పునాదిపై ఎక్కువ కాలం నిలవదు అని అంటూ ఉంటారు. నమ్మకం లేని చోట్ల గొడవలు దారుణాలే ఎక్కువగా గెలుస్తూ ఉంటాయి. ఈ అనుమానం అన్న పదం భార్యభర్తలు, ప్రేమికుల మధ్య బంధాలను దూరం చేస్తోంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే..

కర్ణాటకలోని యాదగిరి తాలూకాకు చెందిన మారుతీ రాథోడ్‌ పెయింటింగ్ పనిచేస్తూ సాగించేవాడు. ఇతను కొన్నేళ్ల క్రితం ముంబైకి వచ్చాడు. కాగా మారుతీ రాథోడ్ కు ఉత్తరప్రదేశ్ కు చెందిన పెండలా వర్మ అనే ఒక యువతతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ఆ స్నేహంగా మరి ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా దాదాపుగా రెండేళ్ల నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. పెండలాకు సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెట్టడం అంటే ఒక పిచ్చి. కానీ అది రాథోడ్ కి ఏమాత్రం నచ్చేది కాదు. దానికి తోడు పెండలా తన మగ స్నేహితులతో కలిసి వీడియోలు చేస్తూ ఉండడంతో అదే విషయంపై ఆ ప్రేమికుల ఇద్దరి మధ్య పలుసార్లు గొడవలు జరిగాయి.

 

ఈ విషయంపై ఇటీవల ఇద్దరికీ గొడవ జరిగింది. అప్పుడు రాథోడ్ ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు ఇకపై నువ్వు మగాళ్ళతో వీడియోలు చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అందుకు పెండలా ఒప్పుకోకపోగా వాళ్ళు నా స్నేహితులు నాతో వీడియోలు చేయవద్దని నేను ఎలా చెప్పగలను అని తెలిపింది. దాంతో రాథోడ్ కి పట్టరాని కోపం వచ్చింది. ఎంతో తన ప్రియురాలిని ఎలా అయినా హతమార్చాలి అనుకున్నాడు. అనుకున్నది ఆలస్యం తన సొంత ఊరికి ప్రియురాలు పెండాలను తీసుకువచ్చాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె గొంతు నులిమి హత్య చేసి చంపేశాడు. అనంతరం ఆమె శివాని దూరంగా ఉన్న తన సొంత స్థలంలోకి తీసుకొని పోయి కాల్ చేశాడు. ఇక స్థానికుల సమాచారం మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాథోడ్ ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -