Viral: ఈ కళ్లద్దాలతో చూస్తే అమ్మాయిలు అలా కనిపిస్తారట.. ట్విస్ట్ ఏంటటే?

Viral: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో టెక్నాలజీని బాగా ఉపయోగించుకుని రకరకాల మోసాలకు దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు దుర్మార్గులు. కష్టపడి డబ్బు సంపాదించడం ఇష్టం లేక చాలామంది ఈజీ మనకోసం ఎంతటి దారుణానికైనా ఒడి గడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎదుటివారి ప్రాణాలను కూడా తీయడానికి లెక్క చేయడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ భూమిపై మనుషుల కంటే మృగాలే ఎక్కువగా జీవిస్తున్నారు అని చెప్పవచ్చు. ఎదుటివారి వీక్నెస్ ను క్యాచ్ చేసుకొని వారి జీవితాలతో ఆడుకోవడం వారి నుంచి లక్షలకు లక్షలు డబ్బులు పోగేసుకోవడం లాంటివి చేస్తున్నారు.

టెక్నాలజీని వాడుకొని అక్రమంగా డబ్బు ఆర్జిస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి తెలుగులోకి వచ్చింది. బెంగుళూరుకు చెందిన శివ, కేరళకు చెందిన కుబైర్, చిత్తు, ఈర్షాద్ అనే వ్యక్తులు చెన్నైలోని కోయంబేడులో నివసిస్తున్నారు. కష్టపడడం ఇష్టం లేక ఈ నలుగురూ ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఓ ప్లాన్ చేసుకున్నారు. సమ్మర్‌ను ఆసరాగా తీసుకుని కూలింగ్ గ్లాసెస్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే అంతవరకూ బాగానే ఉంది వాటిని అమ్మేవారికి మాత్రం వారు సదరు కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే వారికి నచ్చిన అమ్మాయిలను న్యూడ్‌గా చూడవచ్చని నమ్మించారు. అలా ఎంతో మందిని మోసం చేసి చ ఆ కూలింగ్ గ్లాస్‌ ల ద్వారా లక్షల్లో డబ్బు సంపాదించుకున్నారు.

ఒక్కో కూలింగ్ గ్లాస్‌ ధర లక్షల్లో విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు కోయంబేడులో ఈ మాయగాళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి రైస్ ఫులింగ్ చేసే సామాగ్రి, గన్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -