Janasena: గ్లాసు ఇక జనసేనకే.. పవన్ కు ఇక చింత తీరినట్లే..

Janasena: జనసేన పార్టీ గుర్తు గ్లాసు గుర్తు అనేది అందరికీ తెలిసిందే. టీ గ్లాస్ ను పోలినట్లు జనసేన గుర్తు ఉంటుంది. ఎన్నికల్లో ఈ గ్లాస్ గుర్తుపైనే గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. అయితే తిరుపతి లోక్ సభ ఎన్నికల సమయంలో గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించడంతో జనసేన పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. జనసేన గుర్తుకే ఇతరులకు కేటాయించడానికి కారణం గత ఎన్నికల్లో ఈసీ గుర్తును కేటాయించడానికి కావాల్సిన సీట్లు, ఓట్ల శాతాన్ని జనసేన సంపాదించుకోలేకపోయింది. దీంతో జనసేన గ్లాస్ గుర్తును వేరేవారికి కేటాయించారు. దీంతో గుర్తుకు తమకు తిరిగి వస్తుందా లేదా అనే ఆందోళన జనసేన పార్టీ వర్గాల్లో మొదలైంది.

ఇప్పటికే ప్రజల్లోకి జనసేన గుర్తు వెళ్లిపోయింది. గత ఎన్నికల్లో కూడా అదే గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో జనసేనది గ్లాస్ గుర్తు అని ఓటర్లలందరికీ తెలుసు. మధ్యలో గుర్తు వేరేవారికి కేటాయించడంతో గ్లాస్ గుర్తు తిరిగి వస్తుందో.. లేదో అనే టెన్షన్ పార్టీ వర్గాల్లో నెలకొంది. అయితే తాజాగా జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. జనసేనకు గ్లాస్ గుర్తును పర్మినెంట్ గా గురిస్తూ ఈసీ నివేదికలో వెల్లడంచిలంది. గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి కొనసాగిస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. దీంతో ఇక గ్లాస్ గుర్తు జనసేనకు పర్మినెంట్ అయియినట్లు అయింది.

జనసేన గ్లాస్ గుర్తు గల్లంతు అయిందంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లు అయింది. దీంతో జనసేన పార్టీ శ్రేణులకు ఊరట కలిగినట్లు అయింది. మొన్నటివరకు గుర్తింపు లేని పార్టీగానే ఎన్నికల కమిషన్ జనసేనను గుర్తించింది. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ గుర్తిస్తూ గ్లాస్ గుర్తు కేటాయించడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక సీటు గెలిచింది. 8 శాతం వరకు ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల తర్వాత జనసేన ఇప్పుడు మరింత బలపడుుతంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరంతరం ఏదోక కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజవాణి, రైతు భరోసా కార్యక్రమాలతో ప్రజల్లో జనసేనకు మైలేజ్ పెంచుకుంటున్నారు. దీంతో గత ఎన్నికలతో పోలిస్తే జనసేన బలం మరింత పెరిగింది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ గట్టిగా పోరాడుతుున్నారు. టీడీపీతో పొత్తుకు కూడా జనసేనాని ఓకే చెప్పారు.

ఇక ఆర్ధికంగా కూడా జనసేన బలపడుతోంది. విరాళాల రూపంలో గత ఏడాది రూ.26.37 కోట్లు వచ్చింది. ఇకఈ ఏడాది రూ.26.37 కోట్లుగా ఉన్నట్లు ఈసీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇక జనసేన పార్టీకి భవనాల రూపంలో రూ.1.01 కోట్లు, వాహనాల రూపంలో రూ.66.37 లక్షలు, ఆఫీస్ ఎక్విప్మెంట్ రూపంలో రూ.56.34 లక్షలు, ఇన్యూరెన్స్ ల రూపంలో రూ.95.47 లక్షల ఆదాయం ఉన్నట్లు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన నివేదికలో జనసేన పేర్కొంది. ఇక ప్రస్తుతం జనసేన పార్టీ బ్యాంకు అకౌంట్ లో రూ.7.60 కోట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -