Pawan Kalyan: దేవుడా.. పవన్ కళ్యాణ్ మౌనం వెనుక ఇంత కథ ఉందా?

Pawan Kalyan: అకాల వర్షాలు కారణంగా తూర్పుగోదావరి జిల్లా రైతులు నష్టపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు అక్కడి రైతులను పరామర్శించి పంట నష్టం తాలూకా వివరాలను కనుక్కున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహారాష్ట్రలో జరుగుతుంది. జరిగిన నష్టాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ షూటింగ్ ఆపి మరీ రైతులను పరామర్శించడానికి వచ్చారు. ఆ సమయంలో ఆయనతోపాటు జనసేన ఏసిపి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన రాష్ట్ర జిల్లా నేతలు కూడా పాల్గొన్నారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కడియం మండలంలో జనసేన పార్టీ విజయం సాధించింది. మీరు వస్తున్నారని ధాన్యం కొనుగోలు వేగవంతం చేశారని పవన్ కళ్యాణ్ కి తెలిపారు రైతులు. ఇంకా కోతలు కోయ్యాల్సి ఉందని పంటని కప్పి ఉంచడం కోసం గోనెసంచులు ఇవ్వటం లేదు అంటూ ఆయనతో తమ గోడ వెళ్ళబోసుకున్నారు.

 

రైతులతో మాట్లాడటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కోసం మీడియా పడి కాపులు పడింది. వచ్చిన దగ్గరనుంచి వెళ్ళిన వరకు వేచి చూసింది కానీ ఆయన మీడియా తో ఒక ముక్క కూడా మాట్లాడకుండా వెను తిరగడంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఏ చిన్న అవకాశం దొరికిన ఏపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోవటంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు మీడియా మిత్రులు.

 

ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ పర్యటించారు. సర్కార్ కి 72 గంటల్లోగా రైతులకు న్యాయం చేయాలంటూ అల్టిమేటం ఇచ్చారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలని తెలుసుకొని కూడా ఆయన పత్తా లేకుండా పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మౌనం వెనుక కారణం ఏమైనా ఉందా అంటూ ఆరా తీస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -