Gold Price: పడిపోయిన బంగారు, వెండి ధరలు.. ఎంత తగ్గాయో తెలుసా?

Gold Price: మగువలు ఎక్కువగా ఇష్టపడేది బంగారం. కానీ.. దాని ధర మాత్రం పైపైకి పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి బంగారం ధర తగ్గితే ఇక బంగారు దుకాణాలన్నీ మహిళలతో కిటకిటలాడుతాయి. కొన్ని పండగల సమయంలో కొండెక్కి ఉన్న బంగారు ధరలు అమాంతంగా తగ్గుతుంటాయి. అలాంటప్పుడు ఎక్కువగా బంగారు కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల ఉక్కెయిన్‌–రష్యాల మధ్య జరిగిన యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావాల కారణంగా చమురు ముడి సరుకులతో పాటు తదితర వస్తువలు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

అందులో భాగంగా బంగారు ధరల్లోనూ కూడా సల్వమార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. తాజాగా బుధవారం బంగారు ధర కాస్త పైకి పెరినట్టు పెరిగి అంతలోనే కిందికి దిగింది. 10 గ్రాముల 22 క్యారెట్స్‌ బంగారంపై రూ. 500 తగ్గింది. అంతేకాక 10 గ్రాముల 24 క్యారెట్స్‌ బంగారంపై కూడా రూ.530 కిందకి దిగినట్లు మార్కెట్లు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారు ధర రూ. 50, 200లు పలుకుతుండగా 22 క్యారెట్ల బంగారు ధర రూ. 46, 000గా నమోదైంది. ఇకపోతే వెండి ధరలు మాత్రం అనుకున్న దానికన్నా భారీస్థాయిలో తగ్గిపోయాయి.

ఈ కారణంతో ఒక్కకిలో వెండి ధర రూ. 1000 తగ్గడంతో ఇప్పుడు దాని ధర రూ.61,500లకు నిలిచింది. అయితే తగ్గిన బంగారు, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి తమకిష్టమైన ఆభరణాలు కొనుగోలు చేసేందుకు బంగారు దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో నగరాల్లోని దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -