Job Vacancies: పదో తరగతి పాసైన వాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు?

Job Vacancies: నిరుద్యోగస్తుల కోసం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఇటీవల ఒక శుభవార్త తెలియజేసింది. ఇండియన్ పోస్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి ఉన్న యువతి యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి విద్యార్హతతో ఉద్యోగాల భర్తీ కోసం పోస్ట్ ఆఫీస్ విడుదల చేసిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రామీణ డాక్ సేవక్ పోస్టులతో పాటు ఇతర పోస్టుల్ని భర్తీ చేయటానికి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో తమిళనాడు సర్కిల్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి కొద్ది రోజుల క్రితం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్, చెన్నై సిటీ రీజియన్, సెంట్రల్ రీజియన్, సదరన్ రీజియన్, వెస్టర్న్ రీజియన్‌లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి . మొత్తం 58 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయవచ్చు.

 

ఈ ఉద్యోగాల కోసం విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడమే కాకుండా,హెవీ మోటార్ వెహికిల్, లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ తప్పనిసరి. అలాగే డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

 

ఇక పోస్టుల ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 58 ఖాళీలు ఉండగా… అందులో చెన్నై సిటీ రీజియన్- 6, సెంట్రల్ రీజియన్- 9, చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్- 25, సదరన్ రీజియన్- 3, వెస్టర్న్ రీజియన్‌- 15 పోస్టులున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఏడో పే కమిషన్‌లోనే లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.

 

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి. చివరి తేదీలోగా The Manager, Mail Motor Service, Chennai, Tamil Nadu. అడ్రస్ కి పంపాలి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -