Jobs Alert: పదో తరగతి పాసైన వాళ్లకు అదిరిపోయే శుభవార్త ఇదే!

Jobs Alert: పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా. అయితే మీకు ఒక చక్కని శుభవార్త. తాజాగా భారత పోస్టల్ శాఖ నుంచి మరో ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో ఇప్పటికే ఫలితాలు నోటిఫికేషన్ చేసిన విషయం తెలిసిందే. మరి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు,విద్యార్హతలు, ఏజ్ లిమిట్ లాంటి వివరాల విషయానికి వస్తే.. ఇందులో
మొత్తం 2 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల అనగా మే 10వ తేదీన ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 10 లోపు వారి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

మొత్తం రెండు ఖాళీలు ఉండగా అందులో రోహ్తక్ జిల్లాలో 1, హిసార్ జిల్లాలో 1 ఖాళీలుగా ఉన్నాయి. అయితే p అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఇకపోతే అర్హత విషయానికి వస్తే.. ఇండియన్ పోస్ట్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ నుంచి టెన్త్ పాసై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లించనున్నారు. ఇక వయోపరిమితి విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు 10 మే 2023 నాటికి గరిష్టంగా 56 ఏళ్లు మించకూడదు.

రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది. ఇక ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే.. స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.. కాగా ఇలా అప్లై చేయాలి? అన్న విషయానికి వస్తే.. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన పత్రాలతో ఈ చిరునామాకు పంపాలి. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్-I, O/o ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, హర్యానా సర్కిల్, ది మాల్, అంబాలా కంటోన్మెంట్ – 133001. https://www.indiapost.gov.in/. కాగా దరఖాస్తు ప్రారంభ తేదీ: 17-04-2023 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: మే 10, 2023.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -