Post Office MIS scheme: పోస్టాఫీసులో ఈ స్కీమ్ గురించి తెలుసా? డబుల్ బెనిఫిట్ మీదే

Post Office MIS scheme:  డబ్బు పొదుపు చేసుకోవాలకొనే వారు చాలా మంది ఉంటారు. నెలవారీ ఆదాయంలో కాస్త పక్కనపెట్టి భవిష్యత్ అవసరాల కోసం దాచుకొనే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతూ వస్తోంది. అలాంటి వారి కోసం పలు బ్యాంకులు చాలా పథకాలతో ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులైతే విపరీతంగా వినియోగదారులకు ఫోన్లు చేసి మరీ ఆఫర్లు చెబుతుంటాయి. అయితే, డబ్బు పొదుపు చేసుకోవాలనుకొనే వారికి పోస్టాఫీసు మంచి ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు.

దంపతుల కోసం ప్రత్యేక స్కీమ్..

పోస్టాఫీసులో చాలా రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల కోసం ఓ స్కీమ్ ను తెచ్చింది తపాలా శాఖ. ఇందులో దంపతులిద్దరూ వార్షికంగా రూ.59,400 వరకు సంపాదించవచ్చు. దీని పేరు పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్. ఇందులో ప్రతి నెలా ఓ నిర్దిష్ట ఆదాయాన్ని పొందే వీలు కలుగుతుంది. నెలవారీ స్కీమ్ నుంచి ప్రయోజనాలు పొందగోరేవారు నెలకు రూ.4,950 పొందవచ్చు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ పథకం కింద దంపతులు జాయింట్ ఖాతా తెరవచ్చు. దీని ద్వారా ఈ అకౌంట్లో డబ్బులు రెట్టింపవుతాయి. పథకంలో కనీసం రూ.1000 పెట్టుబడిగా పెట్టాలి. సింగిల్ గా అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా నాలుగున్నర లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే 9 లక్షల వరకు డిపాజిట్ చేసే వీలుంది.

రిటైర్ అయిన ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ కు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ఏడాదికి 6.6 శాతం వడ్డీ వస్తుంది. రిటర్నులు, మీరు పెట్టిన డిపాజిట్లపై పొందిన వార్షిక వడ్డీ రేట్లను ఆధారంగా చేసుకొని లెక్కేస్తారు. భార్యాభర్తలిద్దరూ 9 లక్షల వరకు డిపాజిట్ చేస్తే 6.6 శాతం వడ్డీ చొప్పున రూ.59,400 వరకు డబ్బులు వస్తాయి. నెలకు రూ.4,950 దాకా అందుకోవచ్చు. ఐదేళ్లకోసారి దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిల నెత్తిన పాలు పోస్తున్న వైఎస్ జగన్.. ఎంత విమర్శలు చేస్తే అంత మేలా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పులివెందులలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో భాగంగా వైఎస్ వారసులు ఎవరో తేల్చుకోవాలంటూ...
- Advertisement -
- Advertisement -