Harish Rao: ఫలించిన ట్రబుల్ షూటర్ హరీష్ మంతనాలు.. మునుగోడులో టీఆర్ఎస్‌కు ఊరట

Harish Rao: మునుగోడులో టీఆర్ఎస్‌కు ఊరట కలిగింది. మునుగోడులోని సాగునీటి ప్రాజెక్టుల భూనిర్వాసితులు గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఆందోళనలు చేస్తున్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు ఇచ్చినట్లు తమకు కూడా ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూనిర్వాసితులు మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయంలో గత 47 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఈ నిరసన దీక్షలో శివన్నగూడెం, రామ్ రెడ్డి పల్లి, ఖదాబక్ష్ పల్లి భూనిర్వాసితులు పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికల క్రమంలో నిర్విరామంగా ఆందోళనలు చేస్తుండటంతో టీఆర్ఎస్ కు చిక్కులు తెచ్చి పెట్టింది. మునుగోులో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న టీఆర్ఎస్ కు ఇది పెద్ద సమస్యగా మారింది.

దీంతో మునుగోడు టీఆర్ఎస్ వర్గాలు గత కొంతకాలంగా సతమతమవుతున్నాయి. దీక్ష విరమించాలని ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ నేతలు కోరుుతున్నా.. వారు వెనక్కి తగ్గలేదు. చివరిక మంత్రి హరీష్ రావు నేరుగా రంగంలోకి దిగారు. దీక్ష చేస్తున్న సాగునీటి పప్రజెక్టుల భూనిర్వాసితులను హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు. దీక్ష విరమించాలని, డిమాండ్లను పరిశీలిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు నల్గొండ జిల్లా పరిధిలోని చౌటుప్పల్ హైవే రోడ్డు మీద 200 గజాల ఇంటి స్థలం, దళిత భూనిర్వాసితులకు దళితబంధు, బీసీ భూనిర్వాసితులకు బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ రుణాలు ఇస్తామంటూ స్పష్టం చేశారు.

మునుగోడు ఉపఎన్నికల్లో భూనిర్వాసితులు చాలామంది నామినేషన్లు వేశారు. దాదాపు 50 మందికిపైగా నిర్వాసితులు నామినేషన్ వేశారు. 100 మంది పైగా నామినేషన్ వేయాలని ప్రయత్నించినా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చివరకు 50 మంది భూనిర్వాసితులు మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్ వేశారు. దీంతో అంతమంది నామినేషన్ వేయడం టీఆర్ఎస్ వర్గాలను కలవరపెడుతోంది.కానీ చివరకు హరీష్ రావు సూచనతో భూనిర్వాసితులందరూ తమ నామినేషన్లను ఉపసంహరింుకున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకోడానికి ఈ రోజే చివరితేదీ.

దాంతో హరీష్ రావు రంగంలోకి దిగి భూనిర్వాసితులతో మాట్లాడి నామినేషన్ వెనక్కి తీసుకునేలా చేశారు. దీంతో టీఆర్ఎస్ వర్గాలకు మునుగోడులో ఊరట కలిగినట్లు అయింది. దాదాపు మునుగోడు ఉపఎన్నికల్లో అత్యధికంగా 150కి పైగా నామినేషన్లు వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు రావడం టీఆర్ఎస ను షాక్ కు గురి చేసింది. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పసుపు రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసిన కవిత ఓడిపోవడానికి పసుపు రైతులే కారణమమయ్యారు. ఇప్పుడు అదే తరహాలో మునుగోడులో భూనిర్వాసితులు నామినేషన్లు వేయడంతో టీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేగింది.

నిజామాబాద్ సీన్ మునుగోడు ఉపఎన్నికల్లో రిపీట్ అవుతుందనే భయం టీఆర్ఎస్ నేతల్లో ఏర్పడింది. భూ నిర్వాసితులు నామినేషన్లు ఉఫసంహరించుకేనా స్థానిక టీఆర్ఎస్ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవి అసలు ఫలించలేదు. కానీ హరీష్ చేసిన ప్రయత్నాలు ఫలించి భూనిర్వాసితులు నామినేషన్లను వెనక్కి తీసుకోడంపై టీఆర్ఎస్ వర్గాలు ఆనందంలో మునిగిపోయాయి. మునుగోడులో ఎలాగైనా గెలిచి బీజేపీకి షాక ్ఇవ్వాలనే ఆలోచనలో బీజేేపీ ఉంది. అందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వపరంగా అన్నీ అవకాశాలను ఉపయోగించుకుంటోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -