MLA: ఆ ఎమ్మెల్యే మంచి కళాకారుడే.. అసలు నిజస్వరూపం ఇదేనా?

MLA: తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పదవిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. తాజాగా 84 పేజీల తీర్పు విలువరించింది. ఈ క్రమంలోనే ఆయనపై ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించాలంటూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విధంగా వనమా వెంకటేశ్వరరావు పై కోర్టు అనర్హత వేటు వేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే నామినేషన్ సమయంలో ఈయన నకిలీ పత్రాలు సమర్పించడమే అందుకు కారణమని చెప్పాలి.

నామినేషన్ వేసే సమయంలో వనమా తప్పుడు వివరాలను అందజేశారు. అదేవిధంగా తన మీద ఉన్న క్రిమినల్ కేసులు ఆస్తులు వివరాలు దాచారని ఆరోపిస్తూ జలగం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై సుదీర్ఘ విచారణ చేపట్టిన అనంతరం తీర్పు ప్రకటించింది. ఆయన భార్య పేరిట ఉన్నదని విక్రయాలు జరిగిన డాక్యుమెంట్లు పరంగా కూడా ఆమె భార్య అని తేలుతుందని జలగం దావాలో పేర్కొన్నారు.

 

ఇలా ఈ విచారణలో భాగంగా ఆయనపై అనర్హత వేటు వేయడమే కాకుండా మరొక విషయం వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వరరావుకు ఒకరు కాదని ఇద్దరు భార్యలు ఉన్నారని ఈ విచారణలో వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో వనమా కుమారుడు కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో వనమా వెంకటేశ్వరరావు పై కూడా అనర్హత వేటు పడింది.

 

ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికలలో వనమా కొత్తగూడెం నుంచి పోటీ చేయడానికి టికెట్ వస్తుందా రాదా అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈయన వ్యవహార శైలి పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.ఇకపోతే ఈ విచారణలో భాగంగా ఈయనకు ఇద్దరు భార్యలు ఉన్నారన్న విషయం బయటపడటంతో ఈ విషయం కాస్త తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో సంచలనంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -