Minister Perni Nani: కేసీఆర్ అల్లుడు, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు సేమ్ టు సేమ్.. పేర్ని నాని షాకింగ్ కామెంట్స్!

Minister Perni Nani: చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు పేర్ని నాని. ఎన్టీఆర్ అల్లుడు గురించి కేసిఆర్ అల్లుడు మాట్లాడుతున్నాడు. ఈ అల్లుళ్ళ గిల్లుళ్లు మనకి తెలియనివా 2018లో ఈ అల్లుడు కేసీఆర్ ని గిల్లేడు అంటూ ఎగతాళి చేశారు. ఎప్పటికైనా ఎన్టీఆర్ కి పట్టిన గతే కేసీఆర్ కి కూడా పట్టేదేమో కానీ ఎన్టీఆర్ అమాయకుడు కాబట్టి అల్లుడు చేత వెన్నుపోటు పొడిపించుకున్నాడు.

కానీ కేసీఆర్ తెలివైన వ్యక్తి కాబట్టి అల్లుడు గిల్లుడికి సరి అయిన సమాధానం ఇస్తాడు అని తెలిపాడు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై కూడా పేర్ని నాని ఘాటుగా స్పందించారు. మొన్నటి వరకు ప్రధాని మోదీ మంచి వారని చెప్తూనే రాష్ట్ర భాజపా నేతలు మాత్రం అలా కాదని పవన్ చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పేర్ని నాని ప్రస్తావించారు. తెలివితేటలను ఎవరైనా పవన్ దగ్గరే నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.

మొన్నటిదాకా కులం లేదని చెప్పిన వ్యక్తి ఆవిర్భావ సభలో ప్రత్యేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాన్ని విపరీతంగా చేశారని ఆరోపించారు. అందరూ ఏకమైనా వైకాపాన్ని ఎదుర్కోలేరని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కి వావి వరసలు లేవు బీజేపీతో కాపురం చేస్తూ తెదేపాతో పొత్తు పెట్టుకుంటున్నాడు. కాపులు ఎక్కువగా ఉన్న కృష్ణాజిల్లాలో ఎందుకు ఎక్కువగా వారాహి యాత్ర చేస్తున్నాడు అని ప్రశ్నించాడు పేర్ని నాని.

మా అందరికంటే ప్రజలు తెలివైన వాళ్ళు, వారికి అన్నీ తెలుసు అని చెప్పుకొచ్చాడు. పాపం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం చాలా కష్టపడుతున్నాడు. ఒకవైపు సినిమా షూటింగులు చేసుకుంటూ మరొకవైపు చంద్రబాబు కోసం చాలా కష్టపడుతున్నాడు. 20 సీట్లు కోసం ఇదంతా అవసరమా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అలాంటివాడు, ఇలాంటి వాడు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ముద్దు అంటున్నాడు దానికి కారణం ఏంటి అంటూ నిలదీశాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -