Pakka Commercial Review: పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ

మారుతి సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో అడల్ట్ సినిమాలు తీసినా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండుగే అనే చిత్రాలను తీశాడు. తన మీద ఉన్న ముద్రను తొలగించుకున్నాడు. అయితే ఇప్పుడు మాస్ హీరో అయిన గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

Gopichand Pakka Commercial Movie Review And Raing

కథ…

న్యాయమూర్తి సూర్య నారాయణ (సత్యమూర్తి) తాను ఇచ్చిన తీర్పు వల్ల ఓ అమ్మాయికి అన్యాయం జరిగిందని తన వృత్తినే వదిలేస్తాడు. ఆ కేసులో వివేక్ (రావు రమేష్)ది తప్పు అని తెలిసినా కూడా జడ్జ్‌గా ఉన్న సూర్య నారాయణ ఏం చేయలేకపోతాడు. తన వృత్తిని వదిలేసి కిరాణ కొట్టు నడుపుకుంటూ జీవిస్తాడు. అతని కొడుకు లక్కీ (గోపీచంద్) పక్కా కమర్షియల్ లాయర్‌గా మారుతాడు. క్రిమినల్ అయిన వివేక్ తరుపున వాదించేందుకు సిద్దపడతాడు. న్యాయాన్ని గెలిపిచేందుకు తండ్రి, అన్యాయానికి మద్దతిస్తూ వాదించేందుకు కొడుకు రంగంలోకి దిగుతారు? చివరకు ఇందులో ఎవరు గెలుస్తారు? అసలు లక్కీ పక్కా కమర్షియల్ లాయర్‌గా ఎందుకు మారుతాడు? చివరకు వివేక్ పరిస్థితి ఏమైంది? అనేది కథ.

నటీనటులు…

డబ్బులిస్తే తిమ్మిని బమ్మి చేసే లాయర్ పాత్రలో గోపీచంద్ అద్భుతంగా నటించేశాడు. లుక్స్, యాక్షన్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ గోపీచంద్ మెప్పించాడు. ఇక సీరియల్ నటిగా, లాయర్‌గా ఝాన్సీ కారెక్టర్‌లో రాశీ ఖన్నా కాస్త అతిగా అనిపించినా మెప్పిస్తుంది. వివేక్‌గా కొత్త విలనిజాన్ని ప్రదర్శించాడు రావు రమేష్. సత్యరాజ్ తనకు అలవాటైన నటనతో అవలీలగా నటించేశాడు. కమెడియన్స్ ఈ సినిమాలో బాగానే కష్టపడ్డారు. అందరూ నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ…

పక్కా కమర్షియల్ అంటూ టైటిల్ పెట్టినప్పుడే మారుతి ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో అర్థం చేసుకోవాలి. ఓ పాట, ఓ కామెడీ, ఓ ఫైట్, ఓ ఎమోషనల్ సీన్.. అంటూ ఇలా లెక్కలేసుకుని చేసుకుంటూ పోయాడు మారుతి. ఈ చిత్రంలో ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. కథనం మాత్రం ఇట్టే తెలిసిపోతుంది. ఎక్కడా కూడా ఆసక్తికరంగా అనిపించదు. చేయని నేరానికి విలన్‌ను కేసులో ఇరికించి శిక్ష వేయడం అనేది మాత్రం కాస్త కొత్తగా అనిపించింది.

ఇక ఇందులో చెప్పడానికి ఎన్నో నీతులున్నాయి. కానీ వాటిని ఆచరించాలి అనే ఆలోచనను మాత్రం జనాల్లోకి తీసుకెళ్లలేకపోయాడు మారుతి. మరీ జబర్దస్త్, లేకి కామెడీ టైపులో కొన్ని సీన్లను రాసుకున్నాడు మారుతి. డబ్బు కోసం జనాలు తమ రక్త సంబంధీకులను కూడా వదిలేస్తారన్నట్టుగా చూపించాడు. చాలా సార్లు ఇందులోని సీన్లు అందరినీ తలదించుకునేలా చేస్తాయి. జడ్జ్‌గా పని చేసిన వాడికే జూనియర్ లాయర్‌గా పనికి రాని హీరోయిన్ సలహాలు ఇస్తుంది.

అలా ఈ చిత్రం మరీ నాసిరకంగా అనిపిస్తుంది. ఏ కోశాన కూడా కనెక్ట్ అవ్వదు. దీనికి తగ్గట్టు పాటలు కూడా ఎక్కవు. కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తుంది. రాశీ ఖన్నా, గోపీ చంద్ పెయిర్ ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తుంది.

ప్లస్ పాయింట్…
గోపీచంద్, రాశీ ఖన్నా

మైనస్ పాయింట్…
కథ, కథనం
డైరెక్షన్

రేటింగ్: 2/5

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -
మారుతి సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో అడల్ట్ సినిమాలు తీసినా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండుగే అనే చిత్రాలను తీశాడు. తన మీద ఉన్న ముద్రను తొలగించుకున్నాడు. అయితే ఇప్పుడు మాస్ హీరో అయిన గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ...Pakka Commercial Review: పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ