Rashi Khanna: రాశిఖన్నాకు ఆ హీరోకు మధ్య అలాంటి బంధం ఉందా?

Rashi Khanna: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాశి ఖన్నా మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా తన అందం అభినయంతో యూత్ ని కట్టిపడేసింది. ఆ తరువాత హీరో గోపీచంద్ నటించిన జిల్ సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. ఈ సినిమా తరువాత ఈమె వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.

తెలుగులో శివమ్, ప్రతిరోజు పండగే, జోరు, బెంగాల్ టైగర్, సుప్రీమ్, వెంకీ మామ, పక్కా కమర్షియల్, శ్రీనివాస కళ్యాణం, హైపర్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో అవకాశాలు తగ్గిపోవడంతో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే తాజాగా రాశి ఖన్నాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే గతంలో ఆమె మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో ఎఫైర్ నడుపుతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం సుప్రీమ్. ఈ సినిమా నుంచి వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ అప్పట్లో వార్తలు జోరుగా వినిపించాయి.

ఆ సినిమా ఇంకా పూర్తవ్వక ముందే వారి మధ్య ప్రేమ చిగురించిందని అప్పట్లో వార్తలు జోరుగా వినిపించాయి. అలా ఒకటి రెండు కాదు దాదాపు సంవత్సరం పాటు ఇద్దరూ పీకలోతు ప్రేమాయణం నడిపించిన తర్వాత సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రాశి కన్నా వారి రిలేషన్ ని సీరియస్ గా తీసుకోకపోవడంతో వెంటనే పులిస్టాప్ పెట్టేసాడట. దాంతో వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ బ్రేకప్ అయ్యింది.
ఈ వార్తలు అప్పట్లో జోరుగా వినిపించాయి. ఇకపోతే సాయి ధరంతేజ్ విషయానికి వస్తే.. ఇటీవల విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -