NTR: తాతకు తగ్గ మనవడు ఎన్టీఆర్.. ఇంత టాలెంటా?

NTR: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆనాడు నందమూరి తారక రామారావు నటనతో చెరిగిపోయిన ముద్ర వేస్తే నేడు జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతిభను కొనసాగిస్తున్నాడు. అద్భుతమైన నటన, డ్యాన్స్ తో ఎన్టీఆర్ చాలా మంది అభిమానుల మనసు దోచుకున్నారు. నందమూరి వంశం నుంచి వచ్చిన హీరోగానే కాకుండా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఎమోషనల్ సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇట్టే కట్టిపడేస్తుంది. అలాగే కామెడీ పంచ్ లు కూడా అద్భుతంగా ఉంటాయి.

పౌరాణిక పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇట్టే ఇమిడిపోగలడు. అటు మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇటు క్లాస్ ఆడియన్స్ ను సైతం తనవైపుకు తిప్పుకున్నారు. ఈ తరం హీరోలలో ఎన్టీఆర్ కు ఓ ప్రత్యేకత ఉంది. కొందరు హీరోలు డైలాగులు చెప్పడంలో విఫలమయ్యారు. మరికొందరు డ్యాన్స్ వేయడంలోనూ కుదేలయ్యారు. ఇంకొందరు సెంటిమెంట్ ను పండించటంలోనూ కాస్త తడబడుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ లో మాత్రం ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. అవలీలగా ఆయన డ్యాన్స్ చేయగలడు, సెంటిమెంట్ పండించగలడు. అలాగే డైలాగ్ డెలివరీ కూడా అద్భుతంగా సింగిల్ టేక్ లో చెప్పగలడు.

ఈ మధ్యనే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఇతర ఇండస్ట్రీ వర్గాల వారు పొగడ్తలతో ముంచెత్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఒక యాక్టింగ్ ట్రాన్స్ ఫార్మర్ అంటూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి కూడా కొనియాడారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టుకతోనే నటుడు అని కొందరు అంటుంటే, ఆయన గ్రాస్పింగ్ పవర్ తో పాటు ఆన్ స్క్రీన్ పై ప్రజెంటేషన్ అద్భుతమైని మరికొందరు కొనియాడుతున్నారు.

తాతకు తగ్గ మనవడు అంటూ ఎన్టీఆర్ ను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం నందమూరి వంశంలో అటు బాలయ్య, ఇటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విభిన్న కథాంశాలతో అద్భుతమైన నటనతో ప్రేక్షక దేవుళ్లను మెప్పిస్తూ వారి అభిమానాలని పొందుతున్నారు. హ్యాట్సాఫ్ ఎన్టీఆర్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -