Geethanjali: శవాల మీద పేలాలు ఏరుకుంటున్న తెలుగుదేశం.. చనిపోయిన గీతాంజలిపై ఇంతలా విషం కక్కాలా?

Geethanjali: తెలుగుదేశం, జనసేన సైకో కార్యకర్తల వేధింపులను భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన ఆంధ్రప్రదేశ్లో అందరిని ఎంతగానో కలిచివేసింది. నాకు ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అని ఎంతో సంతోషంగా చెప్పినటువంటి ఆమె సంతోషాన్ని ఈ సైకోలు జీర్ణించుకోలేకపోయి ఆమెపై విషం కక్కారు. సోషల్ మీడియా వేదికగా ఇస్టానుసారంగా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నారు.

తమ వల్ల ఒక ఆడబిడ్డ మరణించింది అనే పశ్చాతాపం కూడా తెలుగుదేశం, జనసేన నేతలలో ఏమాత్రం లేదని కనీసం ఆమె గురించి మాట్లాడుతూ తనకు నివాళులు అర్పించిన దాఖలాలు కూడా లేవని చెప్పాలి. ఇలా చనిపోయిన ఆమె ఆత్మకు కూడా శాంతి లేకుండా చనిపోయినటువంటి ఆమె పట్ల విషం కక్కుతూ తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు.

ఫేక్ వీడియోలు సృష్టించి ఆమె వ్యక్తిత్వం పై నిందలు వేసి దానికి వాయిస్ మిక్సింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒకప్పుడు రాబందులు చనిపోయిన శవాలను పీకు తినేవి ఇప్పుడు రాజకీయ రాబందులుగా చంద్రబాబు నాయుడు అలాగే తన కార్యకర్తలు చనిపోయిన వారి వ్యక్తిత్వాన్ని కూడా నిందిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.

తమ వల్ల తప్పు జరిగిందని తెలిసినా కూడా ఆ తప్పుకు పశ్చాత్తాపం లేకుండా తమది తప్పు కాదని అవతల వాళ్ళదే తప్పు అని చివరికి వాళ్ళ వ్యక్తిత్వం పై కూడా బురద చల్లే విధంగా తన పచ్చ మీడియాని ప్రోత్సహిస్తూ వారి వ్యక్తిత్వాన్ని కూడా కించపరచడం చంద్రబాబు నాయుడుకు వెన్నుతో పెట్టినటువంటి విద్య. గీతాంజలి విషయంలోనే కాదు ఆనాడు నందమూరి తారక రామారావుని వెన్నుపోటు పొడిచి అనంతరం తన వ్యక్తిత్వం పై బురద చల్లి పదవిని లాకున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -