High Court: హైకోర్టు జడ్జీలపై ఆరోపణలు చేస్తున్న పచ్చ మీడియా.. ఇంతకు దిగజారలా?

High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు క్రమం తప్పకుండా పథకాలను అందిస్తూ జగన్ సర్కార్ ప్రజలకు మరింత దగ్గరవుతోంది. అయితే 2024లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని పచ్చ మీడియా తెగ టెన్షన్ పడుతోంది. అందుకే పచ్చ మీడియా ప్రతినిధులు హైకోర్టు జడ్జీలపై సైతం ఆరోపణలు చేస్తున్నారు.

అవినాష్ రెడ్డిపై వివేకా హత్య కేసులో నమోదైన ఆరోపణల విషయంలో హైకోర్టు జడ్జీలు పలు సూటి ప్రశ్నలను సంధించారు. అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని ఎలా చెబుతున్నారని ఆధారాల సేకరణకు ఎందుకు ఆలస్యమైందని ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగినట్టు ఎలా నిర్ధారిస్తున్నారని అవినాష్ రెడ్డి లోక్ సభ ఎంపీ అనే విషయాన్ని ఏ విధంగా మరిచారని హైకోర్టు జడ్జీల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.

 

అవినాష్ రెడ్డికి వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని సీబీఐ తీరు అనుమానాస్పదంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే పచ్చ మీడియా మాత్రం వైసీపీపై, హైకోర్టు జడ్జీలపై విష ప్రచారం చేస్తోంది. ఏబీఎన్ వెంకట కృష్ణ డిబేట్ లో డబ్బు మూటలు తీసుకుని జడ్జ్ మెంట్లు ఇస్తున్నారు అంటూ న్యాయ స్థానాలు, జడ్జీల మీద సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.

 

మాజీ జడ్జి రామకృష్ణ, బీజేపీ నాయకులు విల్సన్, ఎంపీ రఘురామ కృష్ణంరాజు సహాయంతో పచ్చ మీడియా ఈ ప్రచారం చేస్తోంది. పచ్చ మీడియా వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తే న్యాయస్థానాలు నిజాయితీగా పనిచేస్తాయని చెబుతూ వ్యతిరేకంగా వస్తే జడ్జీలపై ఆరోపణలు చేస్తోంది. మూటలు తీసుకుని ఇచ్చారంటూ డిబేట్ లో అవినాష్ రెడ్డి, హైకోర్టు జడ్జీల పరువు తీసేలా ఏబీఎన్ డిబేట్ లో చేసిన కామెంట్లపై విమర్శలు వస్తున్నాయి. సస్పెండెడ్ జడ్జి రామకృష్ణ ఈ సంచలన ఆరోపణలు చేశారు. రఘురామ కృష్ణంరాజు అయితే ఏకంగా సుప్రీం కోర్టు ఆర్డర్లను హైకోర్టు జడ్జి తుంగలో తొక్కారని సంచలన కామెంట్లు చేశారు. తెలుగు ప్రజలు సిగ్గు పడేలా పచ్చమీడియా రాతలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -