Volunteers: వాలంటీర్ల మనస్సులో ఏముంది.. అసలు వాస్తవాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Volunteers:  ఏపీలో వాలంటీర్ వ్యవస్థ గురించి పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తెరపైకి వచ్చింది అయితే ఈ వాలంటీర్లు అందరూ కూడా వైసిపి కార్యకర్తలు కావటం గమనార్హం. ఇదే విషయాన్ని స్వయాన జగన్మోహన్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో తెలియజేశారు.

ఇలా జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు వాలంటీర్లు అందరూ కూడా వైసిపి కార్యకర్తలు అని చెప్పినప్పుడు ఎన్నికల విధులలో భాగంగా వారిని దూరంగా ఉంచడం సమంజసం అని చెప్పాలి. వాలంటీర్లు, సామాజిక పెన్షన్లు పంచడంపైనా నిషేధం తెరపైకొచ్చింది. అంతే, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనూహ్యమైన రీతిలో రచ్చ చేసింది. వాలంటీర్లు పింఛన్ ఇవ్వకపోతే 31 మంది చనిపోయారు అంటూ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

పక్క రాష్ట్రాలలో ఎక్కడా కూడా వాలంటీర్లు లేరు అక్కడ లేని మరణాలు మన రాష్ట్రంలోని ఎందుకు జరిగాయి అన్న ప్రశ్న అందరికీ కలుగుతుంది. ఇంకోపక్క, ఎన్నికల సమయంలో తమపై వేటు పడిందంటే, అసలు తమ వ్యవస్థకు చట్టబద్ధత ఎక్కడుందన్న సందేహం అందరిలోనూ ఉంది ఇన్ని రోజులు వైసిపి కేవలం అవసరాలకు మాత్రమే వాడుకున్నారని విషయాన్ని గ్రహించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా మరణిస్తే అక్కడికి వెళ్లి వీడియోలు తీసి తమకు పంపించాలని వైసిపి నేతలు చెబుతున్నారు. ఇలా తమ చేత ఎన్నో అడ్డమైన పనులు చేయించుకుంటూ తమకు ఎలాంటి చట్టభద్రత లేదని, ఈ విషయాలన్నింటినీ పైకి చెప్పుకుంటే మా మీద భౌతిక దాడులూ జరుగుతాయ్.. అందుకే, ఏ విషయమూ పైకి చెప్పలేకపోతున్నాం అంటూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -