Gudivada Amarnath: గాజువాక టికెట్ తో గుడివాడ అమర్నాథ్ కు కొత్త కష్టాలు.. టికెట్ వచ్చినా లాభం లేకుండా పోయిందా?

Gudivada Amarnath: గుడివాడ అమర్నాథ్ పరిస్థితి వైసీపీలో గందరగోళంగా మారింది. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ ను జగన్ ఐటీ మంత్రిగా చేశారు. అయితే.. ఆయన నిర్వహిస్తున్న శాఖపనితీరుపై పెట్టే ప్రెస్ మీట్లు కంటే.. పవన్ ను విమర్శించడానికే ఆయన ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టారు. దీంతో.. సొంత నియోజవర్గంలో ఆయనపై ప్రజా వ్యతిరేకత ఎక్కువైంది. వైసీపీ చేసిన అంతర్గత సర్వేలో కూడా ఇదే విషయం తేలింది. అనకాపల్లిలో అమర్నాథ్ ఓటమి ఖాయమని తేలడంతో.. జగన్ అక్కడ కొత్తవారికి అవకాశం కల్పించారు. పవన్, చంద్రబాబును తిట్టిన వారి చివరికి జగన్ పక్కన పడేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అమర్నాథ్ కు గాజువాక సీటును కేటాయించారు.

అమర్నాథ్ గాజువాకలో ప్రచారాన్ని మొదలు పెట్టారు. అయితే.. అక్కడ స్థానిక నేతల నుంచి ఆయనకు సహకారం అందడం లేదు. గాజువాక టికెట్ కేటాయించిన తర్వాత తొలిసారి నియోజవర్గంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఇటీవల సమన్వయకర్తగా తొలిగించబడిన ఉరుకూటి చందుతో పాటు.. వాళ్ల అనుచరులు సమావేశానికి దూరంగా ఉన్నారు.

మొదట సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. అయితే.. పార్టీలో ఆయన నియామకాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అంతేకాదు.. అమర్నాథ్ కూడా దేవన్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపారు. దీంతో దేవన్ రెడ్డిని తొలగించి ఉరుకూటి చందును నియమించారు. చందు నియామకానికి అమర్నాథ్ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. కొంత సొమ్ము వసూలు చేశారని కూడా ప్రచారం ఉంది. మొత్తానికి ఉరుకూటి చందు నియామకం జరిగింది. ఆయన కూడా ప్రచారం ప్రారంభించారు. ఇక టికెట్ ఆయనకే అని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో.. చందు ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్దం చేసుకున్నారు. అయితే.. సడెన్ గా తెరపైకి అమర్నాథ్ రావడంతో చందు ఖంగుతున్నారు. అమర్నాథ్ నియోజకవర్గం ఏర్పాటు చేసిన తొలి సమావేశానికి ఎవరు హాజరుకాలేదు. అమర్నాథ్ వలనే తమకు టికెట్ దూరమైందని చందు, దేవన్ రెడ్డి వర్గాలు మంత్రిపై గుర్రుగా ఉన్నారు. దీంతో.. అమర్నాథ్ పరిస్థితి దారుణంగా తయారైంది. టికెట్ రాకపోతే హ్యాపీగా ఇంట్లో కూర్చునేవాడినని.. ఇప్పుడు ఇంత వర్గపోరుతో ఎలా నెట్టుకొని రావాలో తెలియడం లేదని సన్నిహితుల దగ్గర అమర్నాథ్ చెబుతున్నారట. పరిస్థితులను చక్కదిద్దేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి బుజ్జగింపులకు ప్రయత్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -