Jr NTR: ఎన్టీఆర్ ఒడిలో ఉన్నటువంటి ఈ చిన్నారి ఎవరో తెలుసా?

Jr NTR: ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఉండగా ఆయన ఎంతో ప్రేమగా ఓ చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్న ఆ చిన్నారి ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు.

సాధారణంగా ఎన్టీఆర్ కి కూతురు అంటే ఎంతో ఇష్టం అనే విషయాన్ని ఇదివరకు ఎన్నోసార్లు తెలియచేశారు. అలాంటిది ఒక చిన్నారిని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకోవడంతో ఈ చిన్నారి ఎవరు అని సందేహం అందరిలోనూ కలిగింది. ఎన్టీఆర్ దగ్గర ఉన్నటువంటి ఈ చిన్నారి ఎవరో తెలుసుకోవడం కోసం పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు అయితే తాజాగా ఈ చిన్నారి ఎవరు అనే విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ వెల్లడించారు.

ఆటో రాంప్రసాద్ సోషల్ మీడియా వేదికగా ఇదే ఫోటోని షేర్ చేస్తూ తన మేనకోడలు అంటూ అసలు విషయం వెల్లడించారు. ఇలా ఆటో రాంప్రసాద్ మేనకోడలు ఎన్టీఆర్ దగ్గర ఉంది అంటే బహుశా దేవర సినిమాలో ఈ చిన్నారి ఏమైనా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాల గురించి ఆటో రాంప్రసాద్ ఎక్కడ వెల్లడించలేదు.ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. RRR సినిమా తర్వాత ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -