Hanuma Vihari: హనుమ విహారిపై విషం కక్కుతున్న వైసీపీ.. తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారా?

Hanuma Vihari: ఏపీ క్రికెట్ అసోసియేషన్‌లో పొలిటికల్ రంగులు పులుముకున్నాయి. చివరికి అది ఏ స్థాయికి వెళ్లింది అంటే టీం కెప్టెన్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించే అంత రాజకీయ ఒత్తిడి కలిగించారు. జట్టు సారధి.. ఆ జట్టులో ఎవరైనా సరిగా ఆడకపోతే మందలించే అవకాశం ఉంటుంది. కానీ దాన్నే అలుసుగా తీసుకొని ఏకంగా కెప్టెన్‌ను తొలగించడం అది సదరు రాజకీయ పార్టీకి కానీ.. ఆ వ్యక్తికి కానీ ఎలాంటి నష్టం ఉండదు. రేపటి రోజున దేశం తరుఫున ఆడాల్సిన ఆటగాళ్లు ఏపీలో కరువు అయిపోతారు. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో హనుమ విహారి పరిస్థితి అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆయన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించారు. ఆయన జట్టులో ఓ ఆటగాడిని మందలించాడనే కారణంగా ఆయన్ని తొలగించారు. అయితే, ఆ ఆటగాడు ఏపీలో అధికారపార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ కొడుకు కావడమే హనుమ విహారిని కెప్టెన్‌గా తొలగించడానికి కారణమైంది. హనుమ విహారి మందలించిన విషయాన్ని ఆ క్రికెటర్ తన తండ్రికి చెప్పాడు. ఆయన ఎలాగూ అధికారపార్టీలో ఉన్నాడు కనుక విహారిపై వేటు వేయించాడు.

ఏపీ క్రికెట్ అసోసియేషన్‌లో విజయసాయిరెడ్డి పెత్తనం రోజు రోజుకూ పెరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జట్టులో బాగా నైపుణ్యం ఉన్నవారికి కాకుండా.. ఆయన అనుచరులకు, డబ్బు ఇచ్చే వారికి అవకాశం ఇస్తున్నారని తొలి నుంచి విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉండటం పలు ఆరోపణలకు దారి తీస్తోంది. భవిష్యత్‌లో టాలెంటడ్ క్రికెటర్లను తయారు చేయాల్సిన బోర్డులో ఇలాంటి రాజకీయాలు ఎందుకని పలువురు మండిపడుతున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ లో జరుగుతున్న తప్పులను కుప్పుకోవడానికి.. మరో తప్పు.. ఇలా వరుస పెట్టి వైసీపీ నేతలు తప్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

హనుమ విహారీకి అనుకూలంగా టీడీపీ, జనసేన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిపించింది. ఆయన్ని కెప్టెన్సీ బాధ్యతలను నుంచి తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, హనుమ విహారికి మద్దతుగా భారత మాజీ క్రికెటర్‌లు స్పందిస్తున్నారు. హనుమ విహారీ తొలగింపు సరికాదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. ఆయన తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించారు. ఇదంత హనుమ విహారిపై బురద చల్లే ప్రయత్నంలా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే జట్టు కోసం కలిసి కట్టుగా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. సహచరుడిపై కోపం అయ్యాడని హనుమ విహారిని కెప్టెన్‌గా తొలగించడం సరికాదని ఆకాశ్ చోప్రా అన్నారు. హనుమ విహారిని గల్లీ ఆటగాడిగా చూస్తే పొరపాటు అవుతోందని చెప్పారు. గతంలో చాలా మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించిన రోజులు గుర్తు లేవా అని ప్రశ్నించారు. రంజీ ట్రోపీలో ఆంధ్రా జట్టును సెమీస్ లో గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. సిడ్నీ టెస్టులో గాయమైనా సరే క్రీజ్‌లో పాతుకుపోయిన విషయం మర్చిపోయారా అని నిలదీశారు. చిల్లర రాజకీయాల కోసం ఇలాంటి ఆటగాడిపై వేటు వేయడం సరికాదని ఆకాశ్ చోప్రా తెలపాడు.

అయితే, అసలు వివాదంపై హనుమ విహారీ కూడా స్పందించారు. ఏం జరిగిందో అని వివరించే ప్రయత్నం చేశాడు. బెంగాల్‌లో జరిగిన మొదటి మ్యాచ్ సందర్భంగా 17వ ఆటగాడి గేమ్ విషయంలో తనకు కోపం వచ్చిందని హనుమ విహారీ చెప్పుకొచ్చాడు. దీంతో… ఆయనపై కోపడ్డానని అన్నారు. కానీ, వ్యక్తిగతంగా విమర్శించలేదని.. గేమ్ విషయంలోనే కోపడ్డానని అన్నారు. అయితే, ఆ కుర్రాడు తన తండ్రికి చెప్పడంతో.. తన తండ్రి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు లేఖ రాశారని హనుమ విహారీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అంతేకాదు.. ఆ మ్యాచ్‌లో బెంగాల్‌ను తాము తొలి మ్యాచ్ లోనే ఓడించామని చెప్పాడు. కానీ, తనను కెప్టెన్సీ నుంచి తొలగించారని హనుమ ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -