Harrasment: చీరలో ఉన్న ఫోటోలను పంపించాలని వేధింపులు.. ఏం జరిగిందంటే?

Harrasment: ప్రస్తుత కాలంలో మహిళలకు ఏ రంగంలోనూ కూడా స్వేచ్ఛ లేదని చెప్పాలి.ఎంతో చదువుకొని ఉన్నత ఉద్యోగాలలో ఉన్నటువంటి అధికారులు కూడా మహిళల పట్ల లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు.ఇలా కొంతమంది వారు పరువు ప్రతిష్టలకు భయపడి ఈ వేధింపులను ఎదుర్కొంటూ ఉండగా మారు కొందరు మాత్రం ముందడుగు వేసి తమపై అధికారులు తమ పట్ల చేస్తున్నటువంటి వేధింపులను బయటకు పెడుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ సీఐడి డిఎస్పీ కిషన్ సింగ్ పై టీఎస్ఎస్పీడీసీఎల్ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ మహిళ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు డిఎస్పీ కిషన్ సింగ్ పై కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే…కిషన్ సింగ్ గత కొన్ని నెలలుగా ఎంతో అసభ్యకరమైన మెసేజ్లు అతని ఫోటోలు వీడియోలు నా ఫోన్ కి పంపిస్తున్నారని ఈమె ఫిర్యాదు చేశారు.

 

అంతేకాకుండా తాను చీరలో ఉన్నటువంటి ఫోటోలను తనకు పంపించాలి అంటూ తనని వేధింపులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వేధింపులు భరించలేక తాను తనపై కేసు నమోదు చేస్తున్నానని ఈమె పేర్కొన్నారు.ఇక వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది అనే విషయాల గురించి కూడా ఈమె తెలిపారు.

 

రెండు సంవత్సరాల క్రితం సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో కిషన్ సింగ్ తనకు పరిచయమయ్యారని ఈ సందర్భంగా మహిళా ఉద్యోగి తెలిపారు. ఇలా ఉన్నత హోదాలో ఉన్నటువంటి అధికారుల మహిళల పట్ల ఇలా వేధింపులకు పాల్పడుతూ ఉంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఈ వార్త తెలిసినటువంటి వారు సదరు ఉద్యోగి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -